Breaking News

“నేర రహిత సమాజమే మన అంతిమ ధ్యేయం”

ఈ రోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అందరూ పోలీస్ అధికారులతో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సంబంధిత పోలీస్ స్టేషన్ వారీగా నేర నియంత్రణ, కేసుల విచారణ తీరు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వారికి ఎదురవుతున్న సమస్యలను కూలంకషంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి పలు విలువైన సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డిఎస్పీలు తప్పకుండా తమ పరిధిలో ఉన్న స్టేషన్లను సందర్శించి, వారి పనితీరు సమీక్షించాలని , తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని వాటి ప్రకారం నేర నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై నాలుగు గంటల పెట్రోలింగ్ గస్తీ ఉండాలని అన్నారు. రోజువారీ పెట్రోలింగ్ ను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని, వీలైనంత తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకోవాలని సూచించారు. నేరస్తులను పట్టుకోవటంలో, నేరపరిశోధనలో, సాంకేతిక ఆధారాలను మరియు సీసీటీవీ కెమెరాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను వెంటాడి పట్టుకోవాలని, పాత నేరస్తుల కదలికల మీద నిఘా వేసి ఉంచాలని, వారు మళ్ళీ నేరాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పోలీసులు తమ విధి నిర్వహణలో పారదర్శకంగా, నిజాయితీగా, జవాబుదారీతనంతో ఉండాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి ప్రజలతో మమేకమై పని చేయాలని, విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఫుట్ పెట్రోలింగ్ ను మరింత ముమ్మరంగా చేయాలని సూచించారు. నూతన నేర న్యాయ చట్టాల గురించి అధికారులు, సిబ్బంది సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని, చట్టపరిధిలోనే పని చేయాలని, దర్యాప్తు నిబంధనలకు అనుగుణంగా నేర పరిశోధన జరగాలని, గరిష్ట శిక్షా రేటు సాధించేలా కృషి చేయాలని సూచించారు.

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. గంజాయి సరఫరా మరియు వినియోగం మీద ఉక్కుపాదం మోపాలని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరచిన పోలీస్ సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *