గంజాయి మత్తులో వీరంగం సృష్టించి వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూసిన పేరు మోసిన రౌడీషీటర్ ను నల్గొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి వివరాలు తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా నల్లగొండలో అనేక హత్య కేసులలో ఉన్న నలపరాజు రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ రౌడియిజం పేరుతో అనేక సెటిల్మెంట్లు చేస్తూ అమాయకులను బెదిరిస్తూ హైదరాబాద్ కేంద్రంగా ఎప్పుడు వెంట పది పదిహేను మందితో ఆగడాలు అరాచకాలు సృష్టిస్తున్నాడు.
ఇతడు ఎవరినైనా టార్గెట్ చేస్తే గంజాయి మత్తులో ఫోన్లు చేసి బెదిరించడం వారి దగ్గరికి మనుషులని పంపించి చంపేస్తానని నల్గొండలో నేను మించిన రౌడీషీటర్ లేరని మెంటల్ రాజేష్ అంటే అందరికీ దడ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు ఈ క్రమంలో ఇతర మతానికి చెందిన ఒక వ్యక్తికి ఫోన్ చేసి అతనిని చంపేస్తానంటూ అతని వర్గాన్ని కించపరుస్తూ బెదిరించగా బాధితుడు ముందుకు వచ్చి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కేసు విషయంలో విచారణ గురించి వెళ్లిన పోలీసులను గంజాయి మత్తులో ప్రతిఘటించి చుట్టూ అతడి అనుచరులను పోలీసుల మీదకు రెచ్చ గొట్టి బీభత్సం సృష్టించి సింపతి పొందాలని చూసుకున్నాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. అతనిని విచారించగా ఎంతోమంది ల్యాండ్ సంబంధించిన సెటిల్మెంట్లు చేసినాడని, డ్రగ్స్ పార్టీలు రౌడీల ను వెంట తిప్పుకుంటూ డాన్ గా ఎదగాలని, అవసరమైతే వినకపోతే నరికి చంపుతానని వెల్లడించినట్లు తెలిసింది.
అతనిపై దాదాపు 17 కేసులు ఐదు హత్య కేసులు, గంజాయి కేసులు పీడీ యాక్ట్ లో కూడా పోయినట్లు తెలుస్తుంది అలాగే బాధితులు స్వచ్ఛందంగా ఇతని ఆగడాలకు గురైనట్లయితే ముందుకు వస్తె మరిన్ని విషయాలు వెలుగు లోకి వచ్చేది ఉంది.