బ్రేకింగ్ న్యూస్
ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్
International

295 బోగీల వాసుకి.

295 బోగీల వాసుకి.

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా భారతీయ రైల్వే పేరుగాంచింది. ప్రతీ రోజూ సుమారు 4 కోట్ల మండి ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది ఇండియన్ రైల్వే. ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెనపై.. అలాగే ప్రకృతి మధ్యలో నుంచి వెళ్లే రైళ్లు ఉన్నాయి. ఈ కోవలోనే భారతదేశంలో అత్యంత పొడవైన రైలు గురించి ఇప్పుడు తెలుసుకుందామా.. సాధారణంగా ఓ గూడ్స్ రైలుకు 25.. లేదా మహా అయితే 50 బోగీలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రైలుకు ఉన్నది ఏకంగా 295 బోగీలు.. ఈ భారీ అనకొండను లాగేందుకు 6 ఇంజిన్‌లు పని చేస్తాయి. ఇంతకీ అదేంటంటే..

సూపర్ వాసుకి.. ఈ కార్గో రైలు పొడవు సుమారు 3.5 కిలోమీటర్లు. ఈ రైలుకు 15-20 కాదు ఏకంగా 295 కోచ్‌లు ఉన్నాయి. ఇక ఆ కోచ్‌లను లాగేందుకు 6 లోకోమోటివ్ ఇంజిన్లు పని చేస్తాయి. ఇంకా చెప్పాలంటే.. ఈ రైలు ఏ స్టేషన్ నుంచైనా దాటాలంటే.. దాదాపుగా గంట సమయం పడుతుంది. ఈ సూపర్ వాసుకి ట్రైన్ ద్వారా దేశంలోని వివిధ గనుల నుంచి సేకరించిన బొగ్గు పెద్ద విద్యుత్ ప్లాంట్లకు రవాణా చేయబడుతుంది. ఈ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి నాగ్‌పూర్‌లోని రాజ్‌నంద్‌గావ్ వరకు సుమారు 27 వేల టన్నుల బొగ్గును తీసుకెళ్తుంది.

ఈ రెండు నగరాల మధ్య ఉన్న దూరాన్ని సూపర్ వాసుకి ట్రైన్ దాదాపు 11.20 గంటల్లో కవర్ చేస్తుంది. శివుడి మెడలోని వాసుకి సర్పం పేరును ఈ రైలుకు పెట్టారు. వాసుకిని పాముల రాజుగా పిలుస్తారు. దేవతులు, రాక్షసుల మధ్య సాగరాన్ని మథించడానికి తాడుకు బదులుగా వాసుకిని ఉపయోగించారు. ఈ పొడవైన రైలు కూడా కదులుతున్నప్పుడు, అచ్చం వాసుకి పాములా కనిపిస్తుందట.

57% మార్కుల నుంచి ఐపీఎస్‌ వరకు.. సమీర్‌ శర్మ స్ఫూర్తిదాయక ప్రయాణం