బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
SANGA REDDY DIST

పోక్సో, అత్యాచార బాధితులకు అండగా “భరోసా”.. 10వ ఆవిర్భావ వేడుకల్లో ఎస్పీ పరితోష్ పంకజ్

పోక్సో, అత్యాచార బాధితులకు అండగా “భరోసా”.. 10వ ఆవిర్భావ వేడుకల్లో ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రంలో భరోసా 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి హాజరై భరోసా సేవలను అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న నేరాల నేపథ్యంలో వర్మ కమిటీ సిఫార్సులు, నిర్భయ ఘటన అనంతరం పోక్సో, అత్యాచార బాధిత మహిళలకు అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో 2016 మే 7న తెలంగాణలో తొలి భరోసా కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

గత 10 ఏళ్లుగా పోక్సో, అత్యాచార కేసులలో బాధిత మహిళలు, బాలికల భద్రతకు భరోసా కేంద్రం పెద్దపీట వేస్తోందన్నారు. ఫిర్యాదు నమోదు నుంచి కోర్టు తుది తీర్పు వచ్చే వరకు మెడికో-లీగల్ సేవలు, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పరిహారం వంటి అన్ని సేవలను ఒకే చోట అందిస్తూ తెలంగాణ భరోసా సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.

ప్రస్తుత ఉమెన్ సేఫ్టీ వింగ్ డైరెక్టర్ చారుసిన్హా ఆధ్వర్యంలో శిక్షణ పొందిన భరోసా సిబ్బంది బాధిత మహిళలకు ధైర్యం నింపుతూ, మెడికల్, లీగల్, కౌన్సెలింగ్, కాంపెన్సేషన్ సేవలను అందిస్తూ సత్వర న్యాయం జరిగేలా పనిచేస్తున్నారని కొనియాడారు.

అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. పోక్సో, అత్యాచార కేసుల బాధితులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని, చిన్న సమాచారం అందిన వెంటనే భరోసా సిబ్బంది బాధితుల వద్దకు చేరుకుని అన్ని రకాల సహాయం అందిస్తారని తెలిపారు. మహిళలపై నేరాల నియంత్రణ కోసం పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికే ‘ప్రజావాణి’: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా భరోసా సేవల కింద ఇప్పటివరకు 688 పోక్సో కేసులు, 85 అత్యాచార కేసులు, 162 కిడ్నాప్ కేసులతో కలిపి మొత్తం 935 కేసులకు సేవలు అందించారు. 175 అవగాహన కార్యక్రమాలు, 249 హోమ్ విజిట్స్, 531 వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే మిషన్ వాత్సల్య స్కాలర్‌షిప్ ద్వారా 24 మందికి రూ.6.40 లక్షలు అందజేయగా, 468 మంది బాధితులకు మొత్తం రూ.1.83 కోట్ల పరిహారం అందించినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యయ్య గౌడ్, టౌన్ ఇన్స్పెక్టర్ రాము నాయుడు, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ పూలబాయ్, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.