Breaking News

ఆకతాయిల ఆగడాలకు చెక్.. మాడిఫైడ్ సైలెన్సర్లపై పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్

సంగారెడ్డి జిల్లా : బైక్ సైలెన్సర్లను మాడిఫై చేసి భారీ శబ్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు మరియు సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనదారులపై పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు పటాన్‌చెరు పట్టణంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్, ఎస్ఐ ఆంజనేయులు మరియు సిబ్బంది కలిసి తనిఖీలు చేపట్టారు.

ఈ డ్రైవ్‌లో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తున్న 07 మంది వాహనదారులను గుర్తించి, మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. అలాగే ఆయా వాహనాలకు అమర్చిన మాడిఫైడ్ సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని తొలగించారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా మాడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగిస్తూ శబ్ద కాలుష్యం సృష్టిస్తే సహించబోమని, అట్టి వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పటాన్‌చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్ హెచ్చరించారు.

ఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *