బ్రేకింగ్ న్యూస్
ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్
Telangana

గుర్రంపోడులో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, ముగ్గురికి గాయాలు

గుర్రంపోడులో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, ముగ్గురికి గాయాలు

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన వద్దిరెడ్డిగూడెం గ్రామ శివారులో గురువారం సాయంత్రం సుమారు 4:20 గంటల సమయంలో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం, అలుగుబెల్లి జైపాల్ రెడ్డి నడుపుతున్న TS 05 FP 2277 నెంబర్ గల కియా సెల్టోస్ కారులో మరెడ్డి బాల్ రెడ్డి, మరెడ్డి అలివేలు, మాలె వెంకటమ్మ, మాలె మంజుల నల్లగొండలో జరిగిన కార్యక్రమానికి హాజరై దేవరకొండ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో మల్లేపల్లి వైపు నుండి గుర్రంపోడు వైపు వస్తున్న TS 05 EV 2192 నెంబర్ గల స్ప్లెండర్ బైక్‌ను కారు అతివేగంగా, నిర్లక్ష్యంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న నర్సింగ్ ధనుంజయ, నర్సింగ్ మధుబాబు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే కారులో ఉన్న మరెడ్డి బాల్ రెడ్డి కూడా తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఉన్న మరెడ్డి అలివేలు, మాలె వెంకటమ్మ, మాలె మంజుల గాయపడగా, వారికి చికిత్స అందిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం

సంబంధిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ పరిశీలించి, సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.