బ్రేకింగ్ న్యూస్
ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్
Telangana

సంగారెడ్డి డిపిఓలో ఎ.ఓ కళ్యాణికి ఘన వీడ్కోలు

సంగారెడ్డి డిపిఓలో ఎ.ఓ కళ్యాణికి ఘన వీడ్కోలు

సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం (డిపిఓ)లో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా విధులు నిర్వహించిన ఇ. కళ్యాణి హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌కు బదిలీపై వెళ్తుండగా, ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ జీవితంలో బదిలీలు సహజమని తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా కళ్యాణి సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారని కొనియాడారు. ముఖ్యంగా కొత్తగా చేరిన కానిస్టేబుళ్లకు తొలి నెలలోనే వేతనం అందేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు.

ప్రతి పనిని సవాలుగా స్వీకరించి, సమయానికి పూర్తి చేసే నైపుణ్యం ఆమె ప్రత్యేకత అని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌లో కూడా ఇదే విధంగా సేవలు అందించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాలని ఆకాంక్షించారు. జిల్లాకు అందించిన సేవలకు గుర్తుగా జ్ఞాపికను అందజేశారు.

కళ్యాణి మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాల్లో కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి డిపిఓ సిబ్బంది సహకారం ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. సిబ్బంది చూపిన ప్రేమ, ఆప్యాయతలను ఎప్పటికీ మరిచిపోనని చెప్పారు. అందరూ తమ విధులను ఇదే విధంగా కొనసాగిస్తూ సేవలో ఉన్నత స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఎఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్లు రమేష్, కిరణ్ కుమార్, లాలూ నాయక్, నాగేశ్వర్ రావు, సూపరింటెండెంట్లు అశోక్, మోహనప్పతో పాటు డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.