బ్రేకింగ్ న్యూస్
రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్
Telangana

తంగళ్ళపల్లి పోలీసులకు పెద్ద సక్సెస్…ముగ్గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్!

తంగళ్ళపల్లి పోలీసులకు పెద్ద సక్సెస్…ముగ్గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్!

సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లి పోలీసులకు కీలక విజయం లభించింది. అంతర్ జిల్లా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై రూరల్ సి.ఐ నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు.

తంగళ్ళపల్లి మండలం తాడూరి గ్రామానికి చెందిన సాసాల లక్ష్మి అనే మహిళ తన ఇంటికి తాళం వేసి తన కుమార్తె వద్దకు వెళ్లిన సమయంలో, మార్చి 30 తెల్లవారు జామున గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న సుమారు 2 తులాల బంగారు ఆభరణాలు, 11 తులాల వెండి ఆభరణాలు, రూ.3 వేల నగదును అపహరించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై ఉపేంద్ర చారి కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు, మండపెళ్లి గ్రామ శివారులో వారిని పట్టుకున్నారు. విచారణలో వారు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అజ్గర్ పాషా (21), సనుగుల గ్రామానికి చెందిన పిట్టల అరవింద్ (20), వేములవాడ మండలం సుభాష్ నగర్‌కు చెందిన సామల బాలకిషన్ (20)గా గుర్తించారు. వారి వద్ద నుంచి దొంగిలించిన 2 తులాల బంగారు ఆభరణాలు మరియు 11 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్

నిందితులపై సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో పలు దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహమ్మద్ అజ్గర్ పాషాపై 21 కేసులు, పిట్టల అరవింద్‌పై 8 కేసులు, సామల బాలకిషన్‌పై 6 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు.

కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి మరియు పోలీస్ సిబ్బంది సంపత్, అరవింద్, శ్రీనివాస్‌లను సి.ఐ అభినందించారు.