బ్రేకింగ్ న్యూస్
పాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయందసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. హైదరాబాద్‌లో 4 పక్షులను రక్షించిన పోలీసులుపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యతప్రవర్తన మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవు: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్విజయదశమి వేడుకల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆయుధ, వాహన పూజలుహైదరాబాద్‌లో హనీ ట్రాప్, సైబర్ బ్లాక్‌మెయిలింగ్ ముఠా గుట్టురట్టు.. నిందితుడి అరెస్ట్దుర్గాష్టమి సందర్భంగా పోలీసు ఆయుధాగారంలో ఆయుధ పూజకోట్‌పల్లి ఎస్‌ఐగా మినాక్షి బాధ్యతల స్వీకరణపాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయందసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. హైదరాబాద్‌లో 4 పక్షులను రక్షించిన పోలీసులుపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యతప్రవర్తన మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవు: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్విజయదశమి వేడుకల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆయుధ, వాహన పూజలుహైదరాబాద్‌లో హనీ ట్రాప్, సైబర్ బ్లాక్‌మెయిలింగ్ ముఠా గుట్టురట్టు.. నిందితుడి అరెస్ట్దుర్గాష్టమి సందర్భంగా పోలీసు ఆయుధాగారంలో ఆయుధ పూజకోట్‌పల్లి ఎస్‌ఐగా మినాక్షి బాధ్యతల స్వీకరణ
Hyderabad

పాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరిక

పాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరిక

దసరా వేళ మూగజీవాల స్వేచ్ఛను హరించవద్దు.. బంధించిన పక్షుల ప్రదర్శనలను ప్రోత్సహించకండి

హైదరాబాద్‌: పండుగ అంటే ఆనందం, స్వేచ్ఛ, తోటి ప్రాణుల పట్ల కరుణ చూపించడమని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, ఐపీఎస్‌ పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను బంధించి, వాటి రెక్కలు కత్తిరించి, ఆహారం, నీరు లేకుండా హింసిస్తూ వ్యాపారం చేయడం అమానవీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మూగజీవాల స్వేచ్ఛను హరించి, వాటిని హింసించడం వల్ల ఎవరికీ మేలు జరగదని సజ్జనార్‌ పేర్కొన్నారు. పక్షుల వేదనలో శుభాన్ని వెతకడం సరికాదని, పండుగల సమయంలోనూ జీవుల పట్ల కరుణ, మానవత్వం చూపించాలని సూచించారు.

పాలపిట్ట పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని, రైతులకు మేలు చేసే పక్షి అని తెలిపారు. నీలాకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నప్పుడే ప్రకృతికి అందం చేకూరుతుందని పేర్కొన్నారు. దసరా సందర్భంగా పాలపిట్టలను బంధించి ప్రదర్శించడం, విక్రయించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బంధించడం, విక్రయించడం చట్టరీత్యా నేరం

దసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. హైదరాబాద్‌లో 4 పక్షులను రక్షించిన పోలీసులు

వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం పాలపిట్టలను బంధించడం, విక్రయించడం, ప్రదర్శించడం చట్టరీత్యా నేరమని సజ్జనార్‌ గుర్తుచేశారు. వన్యప్రాణుల పట్ల క్రూరత్వానికి పాల్పడే చర్యలను అరికట్టేందుకు ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

ఎక్కడైనా పాలపిట్టలను బంధించినట్లు, విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే 18004255364, 9803338666 టోల్‌ఫ్రీ నంబర్లకు లేదా డయల్‌ 112కు సమాచారం అందించాలని సూచించారు.

ఈ దసరా పండుగ వేళ మూగజీవాలకు స్వేచ్ఛను ప్రసాదిస్తూ, ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీపీ వీసీ సజ్జనార్‌ పిలుపునిచ్చారు.