బ్రేకింగ్ న్యూస్
పాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయందసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. హైదరాబాద్‌లో 4 పక్షులను రక్షించిన పోలీసులుపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యతప్రవర్తన మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవు: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్విజయదశమి వేడుకల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆయుధ, వాహన పూజలుహైదరాబాద్‌లో హనీ ట్రాప్, సైబర్ బ్లాక్‌మెయిలింగ్ ముఠా గుట్టురట్టు.. నిందితుడి అరెస్ట్దుర్గాష్టమి సందర్భంగా పోలీసు ఆయుధాగారంలో ఆయుధ పూజకోట్‌పల్లి ఎస్‌ఐగా మినాక్షి బాధ్యతల స్వీకరణపాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయందసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. హైదరాబాద్‌లో 4 పక్షులను రక్షించిన పోలీసులుపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యతప్రవర్తన మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవు: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్విజయదశమి వేడుకల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆయుధ, వాహన పూజలుహైదరాబాద్‌లో హనీ ట్రాప్, సైబర్ బ్లాక్‌మెయిలింగ్ ముఠా గుట్టురట్టు.. నిందితుడి అరెస్ట్దుర్గాష్టమి సందర్భంగా పోలీసు ఆయుధాగారంలో ఆయుధ పూజకోట్‌పల్లి ఎస్‌ఐగా మినాక్షి బాధ్యతల స్వీకరణ
Hyderabad

దసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. హైదరాబాద్‌లో 4 పక్షులను రక్షించిన పోలీసులు

దసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. హైదరాబాద్‌లో 4 పక్షులను రక్షించిన పోలీసులు

మూడు ప్రాంతాల్లో పోలీసుల దాడులు.. అటవీశాఖ అధికారులకు అప్పగింత

హైదరాబాద్: దసరా పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను బోనుల్లో బంధించి ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు చర్యలు చేపట్టారు. పౌరుల నుంచి అందిన సమాచారంతో నగరంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి, బోనుల్లో బంధించిన నాలుగు పాలపిట్టలను సురక్షితంగా రక్షించారు. అనంతరం వాటిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్ సమీపంలోని ఆలయం వద్ద ఇరుకైన బోనులో బంధించిన రెండు పాలపిట్టలను పోలీసులు విడిపించారు. అలాగే ఛత్రినాకలోని శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం వద్ద చెట్టుకు బోను వేలాడదీసి బంధించిన ఒక పాలపిట్టను, మంగళహాట్‌లోని బాలాజీనగర్ గుడి సమీపంలో బోనులో ఉంచిన మరో పాలపిట్టను రక్షించారు. మొత్తం నాలుగు పక్షులను అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

వన్యప్రాణులను బంధించి హింసిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం పక్షులను బోనుల్లో బంధించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. బాధ్యులపై అటవీశాఖ సమన్వయంతో చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

పాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరిక

పండుగల పేరుతో మూగజీవాలను బంధించడం, వాటికి ఆహారం, నీరు అందకుండా ఇబ్బందులకు గురిచేయడం అమానవీయమని పోలీసులు పేర్కొన్నారు. నిజమైన భక్తి అంటే జీవకారుణ్యాన్ని చూపడం, ప్రకృతిని, వన్యప్రాణులను కాపాడటమేనని తెలిపారు. పాలపిట్టల వంటి పక్షులను బంధించి డబ్బులు సంపాదించే చర్యలను ఎవరూ ప్రోత్సహించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వన్యప్రాణులను బంధించడం, హింసించడం వంటి ఘటనలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే 18004255364, 9803338666 లేదా డయల్ 112 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. వన్యప్రాణుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.