బ్రేకింగ్ న్యూస్
కురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్కురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్సంగారెడ్డి–మదీనగూడ NH-65 విస్తరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్, ఎస్పీరాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలుకురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్కురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్సంగారెడ్డి–మదీనగూడ NH-65 విస్తరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్, ఎస్పీరాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు
Telangana

సమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

సమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

మహబూబాబాద్ జిల్లా, ఆగస్టు 14: సమర్థవంతమైన పోలీసింగ్‌తో పాటు మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పోలీస్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం చిన్నగూడూరు పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా ఆయన తనిఖీ చేశారు.

చిన్నగూడూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్టేషన్ ప్రాంగణం, వివిధ గదులను పరిశీలించి నిర్వహణ తీరును సమీక్షించారు. పెండింగ్ పిటిషన్లు, పిటిషన్ రిజిస్టర్‌తో పాటు ఇతర రికార్డులను తనిఖీ చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

గ్రామాల సందర్శనలు, విలేజ్ పోలీస్ ఆఫీసర్స్‌ (VPOs) ద్వారా సేకరిస్తున్న నేర సమాచారం, గ్రామాల్లోని పరిస్థితులపై ఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి పోలీస్ అధికారులకు చేరవేయాలని సూచించారు.

బ్లూ కోల్ట్స్ సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ.. వారి విధులు, బీట్ నిర్వహణ, అత్యవసర సమయంలో సంఘటనా స్థలానికి చేరుకునే సమయం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు అత్యవసర సమయాల్లో వేగంగా పోలీస్ సేవలు అందేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.

మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక నిఘా

మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, ప్రదేశాలపై సమాచారాన్ని సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు బానిస కాకుండా గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. గంజాయి వినియోగిస్తున్నట్లు గుర్తించిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, అవసరమైన సందర్భాల్లో డీ-అడిక్షన్ సేవల వైపు మళ్లించాలని సూచించారు.

గుడుంబా తయారీపై ఉక్కుపాదం

గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబా తయారీ, విక్రయాలపై నిరంతరం దాడులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. గుడుంబా తయారీ కేంద్రాలు, అక్రమ మద్యం తయారీకి ఉపయోగించే ప్రదేశాలపై నిఘా పెంచి చట్టవిరుద్ధ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు.

కురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్

గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడే వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని, మద్యం వల్ల కలిగే అనర్థాలపై వారికి, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు.

నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు

రౌడీషీటర్లు, అనుమానితులు, గంజాయి మరియు ఇతర నార్కోటిక్స్‌ నేరస్థుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామాల్లో నేరాలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే స్పందించాలని సూచించారు.

పోలీస్ స్టేషన్‌లోని ఫైల్స్, రికార్డులు, కేసు ఫైల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ.. పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, కేసుల పరిష్కారం, రికార్డుల నిర్వహణపై ఎస్‌ఐ, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

రోజువారీ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ కేసుల దర్యాప్తును నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లో రికార్డులు, కేసు ఫైల్స్‌ను సక్రమంగా నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు నైట్ పెట్రోలింగ్, బీట్ విధులు, గ్రామ సందర్శనలు, నేర సమాచార సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ సూచించారు.

పోలీస్ స్టేషన్‌లో మొక్క నాటిన ఎస్పీ

వార్షిక తనిఖీ అనంతరం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మరిన్ని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సిబ్బందికి సూచించారు.