Breaking News

ఘనంగా ముగిసిన పోలీస్‌ వార్షిక క్రీడలు

ఓవరాల్ చాంపియన్ గా డిస్ట్రిక్ట్ ఆర్ముడ్ రిజర్వ్ సాయుధ బలగాల జట్టు

విజేతలకు బహుమతుల ప్రదానం చేసిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ IAS , వారితో పాటు DFO విశాల్ IFS , అడిషనల్ కలెక్టర్ లెనిన్ IAS

పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ – 2025 గురువారం సాయంత్రం ఘనంగా ముగిసింది. మూడు రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీల్లో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ IAS ముఖ్య అతిథిగా విశిష్ట అతిధులు గా DFO విశాల్ IFS,అడిషనల్ కలెక్టర్ లెనిన్ IAS హాజరయ్యారు. జిల్లా సాయుధ బలగాల టీం, all వింగ్స్ హెడ్ క్వార్టర్స్ టీం ఫైనల్ టాగ్ ఆఫ్ వార్ పోటీలను ఆసక్తిగా తిలకించారు. టాగ్ ఆఫ్ వార్ ఫైనల్ లో సాయుధ టీం విజయం సాధించారు. అనంతరం పోలీసు క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్పోర్ట్స్ మీట్ కు ప్రతీకగా సూచించే పోలీస్ క్రీడ పతకాన్ని గారికి క్రీడాకారులు అందించారు.

*పోలీస్ స్పోర్ట్స్ మీట్లో విజేతలుగా నిలిచిన విజేతలకు, జట్లకు ట్రోఫీలు, మెడల్స్, మెమెంటోలు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. మారుతున్న పరిస్థితులలో పోలీసింగ్ అనేది చాలా సవాల్ తో కూడినదని అలాంటి చాలెంజ్ లను సమర్థవంతంగా ఎదుర్కోని
ప్రజలకు మెరుగైన సేవలు అందిచాలంటే శారీరక ఆరోగ్యం, మానసిక దృఢత్వం కలిగి వుండటం పోలీసు సిబ్బందికి చాలా కీలకమని అన్నారు.

జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS సారథ్యంలో పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 పండుగ వాతావరణంలో కొనసాగిందని దానికి నేను ముఖ్య అతిధిగా రావడం చాలా ఆనందం గా ఉంది అన్నారు.

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ ల బదిలీలు

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ…

పోలీసులకు మానసిక ఒత్తిడిని తగ్గించి వారిలో క్రీడా స్ఫూర్తిని కల్పించేందుకు స్పోర్ట్స్‌ మీట్‌ ను నిర్వహించినట్లు తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బందిఉత్సాహంగా పోటీల్లో పాల్గొని, తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారని అన్నారు.

క్రీడలు విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన పోలీసు అధికారులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు, పోలీసు అధికారులను అభినందించారు

ఈ క్రీడల్లో కబడ్డీ, వాలీబాల్, టగఫ్ వార్, క్రికెట్, షటిల్ బాట్మింటన్, షాట్పుట్, డిస్కస్ట్లో, హైజంప్, లాంగ్లింప్, రన్నింగ్ 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, 800 మీటర్స్, 1500 మీటర్స్, 4×100 మీటర్స్ రిలే, 4×400 మీటర్స్ రిలే తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. మహిళా పోలీస్ లు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొవడం జరిగిందని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *