Breaking News

మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీములతో ప్రజలు అప్రమత్తంగా వుండాలి

మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీముల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాం నాథ్ కేకన్ ప్రజలకు సూచించారు.

ప్రజల సొమ్ము దోచుకోనేందుకు సైబర్‌ నేరగాళ్ళు రోజు,రోజుకి కొత్త కొత్త పోకడలతో ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకోనేందుకు సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాలను ప్రయోగిస్తున్నారు.

ఇందులో భాగంగానే మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీం, పిరమిడ్‌,బిట్ కాయిన్స్, వీక్స్ కాయిన్స్,యూ బిట్ కాయిన్స్,యూరిక్స్ కాయిన్స్ మరియు ఇతర కాయిన్స్ లాంటి స్కీంల ద్వారా ప్రజల నుండి డబ్బును దోచేస్తున్నారు.

మొబైల్ కు లేదా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అయిన ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం, టెలిగ్రాం, ట్విట్టర్ అకౌంట్ వినియోగదారులకు

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ ల బదిలీలు
  1. Coasta Earning App,

2.pyramid scheme

3.Adidas

  1. Yamaha make waves
  2. LFL ,
  3. VC COFFEEIN
    వంటి
    పేర్లతో లింక్ ద్వారా ఫైల్ వస్తుందని దానిని ఇన్ స్టాల్ చేసుకున్నాక అప్లికేషన్ లో రిజిస్టర్ అయిన తరువాత ఒక వాట్సాప్ గ్రూపు కు యాడ్ చేస్తారని,వారు అంతకు ముందు పెట్టిన ఇన్వెస్ట్మెంట్,వచ్చిన ప్రాఫిట్ కు సంబంధించిన నకిలీ పత్రాలను గ్రూపు లో షేర్ చేయగా వాటిని నమ్మి మొబైల్ వినియోగ దారులు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుందని, మొదట చిన్న చిన్న అమౌంట్ కు లాభాలు వెంటనే ఇస్తారని,ఎక్కువ అమౌంట్ పెట్టాక స్పందించరని,
    అలాగే ఇంకో విధానంలో నెక్స్ట్ లెవెల్ అంటూ ఎక్కువ అమౌంట్ తో ఎక్కువ సంఖ్యలో ఒకరి క్రింద ఒకరిని జాయినింగ్ చేపిస్తూ,శని,ఆదివారా లలో సక్సెస్ మీటింగులు పెడుతూ ఎక్కువ మందిని చేర్పించిన వారిని సత్కరిస్తూ మరింత ఎక్కువ మందిని చేర్పించేలా ప్రోత్సహిస్తారని,
    ఎక్కువ సంఖ్యలో ప్రజలు జాయిన్ అయి భారీగా పెట్టుబడులు పెట్టాక ఒకే సారి కంపనీని ఎత్తేస్తారని, ప్రజలు గుర్తుంచుకోవాలి.
    ఎవరూ ముఖ్యంగా మనకు ఎటువంటి సంబంధం లేని వాళ్ళు మనకు ఏ విధమైన ఆర్థిక ప్రయోజనం ఊరికే చేయరు.మనల్ని నమ్మించి, మభ్యపెట్టి,వంచించి మన దగ్గరి,మన ద్వారా మరికొందరి కష్టార్జితాన్ని కొల్లగొట్టడమే వారి పని.
    కాబట్టి ఇలాంటి నేరాల పట్ల,మొబైల్ ఫోన్లను చూసే మనకు ఫేస్ బుక్, వాట్సాప్,టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈమెయిల్, ఫోన్ కాల్ ల ద్వారా మీ దృష్టిని ఆకర్షించే ఈ కుట్రలకు ఎట్టిపరిస్థితుల్లో లొంగకండి.
    తొందరపడి బాధలను, నష్టాలను కొని తెచ్చుకోకండి.
    డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్త పడాలి.
    ఒకవేళ మీరు అన్ని జాగ్రత్తలను తీసుకున్నా కూడా మోసపోయిన పక్షంలో ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్ కి గానీ, www.cybercrime.gov.in ద్వారా కానీ లేదా మీ సమీప పోలీస్ స్టేషన్ లో నైనా వెంటనే పూర్తి వివరాలతో పిర్యాదు చేయాలని ఎస్పీ గారు ప్రజలకు సూచించారు.

జిల్లా లో జరుగుతున్న సైబర్ నేరాలను జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ కె.శ్రీనివాస్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బాధితులు వెoటనే పోలీస్ స్టేషన్ లలో సైబర్ వారియర్స్ ను కలిసేలా చేసి సంబంధిత బ్యాంకు వారితో మాట్లాడి అమాంట్ ను హోల్డింగ్ చేపించడం,గ్రామాలలో సైబర్ వారియర్స్ ద్వారా ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుందని ఎస్పీ అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *