
జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సూచనలతో యస్.బి డీఎస్పీ రమేష్ అధ్వర్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు నమోదు చేసుకొని ప్రతి ఒక్కరు స్వేచ్చాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మన దేశ ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ,ప్రజాస్వామ్య సాంప్రదాయాలను,స్వేచ్ఛాయుత,నిష్పక్ష్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం,భాష లేదాఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, ఏ.ఓ శ్రీనివాస్, ఆర్.ఐలు సూరప్ప నాయుడు,సంతోష్, శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు
