Breaking News

గంజాయి కేసులో పట్టుపడ్డ ముగ్గురు నిందితులు రిమాండ్.

నిందితుల వద్ద నుండి సుమారు (30 వేల విలువ గల) 1.21 కేజీల గంజాయి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం.
1) తల్లమల్ల శివ శంకర్ @ శివ తండ్రి చంద్రయ్య, 2) భక్తుల శబరి గిరీష్ తండ్రి లక్ష్మణ్, 3) యాసా భాను ప్రకాష్ రెడ్డి తండ్రి రామ్ రెడ్డి, 4) మెడబోయిన చక్రి పరారీ లో ఉన్నారు, 5) వట్టికోటి శంకర్ పరారీ లో ఉన్నారు, 6) మేకల రాంచరణ్ పరారీ లో ఉన్నారు. నిందితులు తల్లమల్ల శివ శంకర్ మరియు భక్తుల శబరి గిరీష్ లు రాజస్థాన్లోని వివేకనంద గ్లోబల్ యూనివర్సిటీ నందు అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశారు. అదే సమయంలో ఇద్దరు గంజాయికి అలవాటుపడ్డారు. నిందితుడు తల్లమల్ల శివ శంకర్ మరియు యాస భాను ప్రకాశ్ రెడ్డి లు ఇంటర్మీడియట్ నుండి స్నేహితులు. నిందితుడు శివశంకర్ తనకి గంజాయి అవసరం ఉన్నప్పుడల్లా అతని స్నేహితులైన శబరి గిరీష్ మరియు భాను ప్రకాష్ నుండి తీసుకొని వాడుకునేవాడు. శబరి గిరీష్ హైదరాబాద్ లోని ఫహత్ నగర్ నుండి గంజాయి తెచ్చుకునేవాడు. గత సంవత్సరం 2024 లో మార్కెట్ పోలీస్స్టేషన్ వారు చేసిన పట్టుబడి చేసే గంజాయి కేసులో జైలుకు పంపినారు. అయినా కూడా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. నిందితుడు శివశంకర్ నల్గొండ పట్టణంలో గంజాయి అలవాటు ఉన్నవారు చాలామంది ఉన్నారు అని వారికి గంజాయిని అమ్మి ఎక్కువ మొత్తంలో సొమ్ము చేసుకోవచ్చని దురుద్దేశంతో, వారం రోజుల క్రితం ముగ్గురు నిందితులు కలిసి పాత్ నగర్ లోని ఒక మహిళ వయసు సుమారు 50 నుండి 20 సంవత్సరాలు నుండి 1.5 కేజీల గంజాయిని కొనుగోలు చేసి నల్గొండకు తీసుకొని వచ్చారు. అందులో కొంత భాగాన్ని చిన్న చిన్న పాకెట్లుగా చేసి నల్గొండ పట్టణంలోని అవసరం ఉన్న కొంతమంది వ్యక్తులకు పాకెట్ ఎనిమిది వందల రూపాయలు చొప్పున అమ్మినాడు. తేదీ 28.07.2025 రోజున ఉదయం మిగిలి ఉన్న గంజాయిని ముగ్గురు వ్యక్తులు సమంగా పంచుకొని నల్గొండ పట్టణంలో అమ్మడానికి వెళ్దామని చూస్తుండగా పోలీసు వారు నమ్మదగిన సమాచారం మేరకు వారిని పట్టుబడి చేసినారు. వారి వద్దనుండి 1.21 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు శివ శంకర్ మరియు శబరి గిరీష్ ల నుండి వారు ఉపయోగించిన రెండు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుబడు చేసిన నల్గొండ వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి ఎస్ఐ సైదులు,గోపాల్ రావు సిబ్బంది షకిల్, సత్యనారాయణ, లింగస్వామి, సైదులు, అఖిల్ లను నల్గొండ జిల్లా ఎస్. పి శరత్ చంద్ర పవార్ ఐ. పి.ఎస్  అభినందించారు.

భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో హై అలర్ట్ – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *