
హలియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల బైక్ దొంగతనాలపై జరిపిన దర్యాప్తులో పోలీసులు 8 కేసుల్లో మొత్తం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వేరు వేరు కేసుల్లో 10 (Hero Splendor–5, Honda Shine–2, Bajaj Platina–1, CB Unicorn–1, Bajaj CT-100–1) మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి ఆస్తి విలువ రూ,5,00,000/- వరకు ఉంటుంది. 1. Cr.No.169/2025 జూన్ 19న హలియా బస్ స్టాండ్ వద్ద ఓ వ్యక్తి తన బజాజ్ ప్లాటినం బైకును పార్క్ చేసి వెళ్లగా, అదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి అట్టి బైక్ ను దొంగిలించిన విషయంలో తాను హాలియా పియస్ నందు ఫిర్యాదు చేయగా, అట్టి పిర్యాదుపై కేసు నమోదు చేసి, విచారణలో భాగంగా యస్.ఐ హాలియ మరియు వారి సిబ్బంది 2025 జూలై 24న అలీనగర్ చెక్ పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా సరైన వాహన పాత్రలు లేకుండా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా, పైన తెల్పిన బైక్ దొంగతనంతో పాటు ఆతను మరో 6 బైక్ దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో అతని నుండి 6 బైక్ స్వాదినపరుచుకొని ఆ నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి, జ్యుడిషియల్ రిమాండ్ కు పంపనైనది. మహమ్మద్ జానీ S/o సులేమాన్, హలియా, నిడమానూర్, హైదరాబాద్ లోని ఆదిబట్ల ప్రాంతాల్లో RTC బస్ స్టాండ్లలో పార్క్ చేసిన బైకులను లక్ష్యంగా చేసుకుని నఖిలి తాళం చెవి ఉపయోగించి దొంగతనాలు చేసేవాడు. 6 (హీరో స్ప్లెండర్ –5,బజాజ్ ప్లాటిన -1)
2.Cr.No.155/2025 జూన్ 22న హలియా బస్ స్టాండ్ వద్ద ఓ వ్యక్తి తన CB యూనికార్న్ బైకును పార్క్ చేసి వెళ్లగా, అదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి అట్టి బైక్ ను దొంగిలించిన విషయంలో తాను హాలియా పియస్ నందు ఫిర్యాదు చేయగా, అట్టి పిర్యాదుపై కేసు నమోదు చేసి, విచారణలో భాగంగా యస్.ఐ హాలియ మరియు వారి సిబ్బంది 2025 జూలై 24న ఉదయం 11:00 గంటల సమయంలో అనుముల గ్రామశివారున, ద్వారకాపురి కమాన్ వద్ద అనుమానాస్పదంగా సరైన వాహన పాత్రలు లేకుండా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా, పైన తెల్పిన బైక్ దొంగతనంతో పాటు వారు మరో రెండు బైక్ దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో వారి నుండి 4 బైక్ లను స్వాదినపరుచుకొని, వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి, జ్యుడిషియల్ రిమాండ్కు పంపనైనది. 1. దేవనబోయిన శ్రీను @ కుప్పయ్య తండ్రి సాంబయ్య, 2. వేముల నాగరాజు S/o పిచ్చయ్య, హలియా, మిర్యాలగూడ పట్టణం, మాచర్ల, గుంటూరు, రెంటచింతల, కారంపూడి ప్రాంతాల్లోని పార్క్ చేసిన బైకులను లక్ష్యంగా చేసుకుని నఖిలి తాళం చెవిలను ఉపయోగించి దొంగతనాలు చేస్తున్నారు. ఇట్టి మొదటి నిండుతుడు దేవనబోయిన శ్రీను @కుప్పయ్య గతంలో ఆంద్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో (06) బైక్ దొంతనం కేసులు నమోదైనవి.
4 ( హోండా షైన్ – 2,CB యూనికార్న్ బైక్– 1,-బజాజ్ CT -100 బైక్-1) ఈ కేసులను ఛేదించడంలో మిర్యాలగూడ, డియస్పీ, కె.రాజశేకర్ రాజు ని, హలియా సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.సతీష్ రెడ్డి ని, హలియా ఎస్ఐ బి. సాయి ప్రశాంత్ ని మరియు వారి సిబ్బంది కానిస్టేబుళ్లు సురేష్, హరి ప్రసాద్, రమేశ్ గౌడ్, శ్రవణ్, శివరాజ్, సుభాష్, రైటర్ కృష్ణ లను అభినందించి వారిని నగదు బహుమతి ప్రకటించనైనది.
