Breaking News

మహిళలకు బ్యూటిషన్ విభాగంలో ఉచిత ట్రైనింగ్

గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ మహానగరంలో సంభవ్ పౌండేషన్ లో”రియల్ కంపెనీ ప్రభుత్వ సహాయ సహకారాలతో సమాజంలో ఉన్నటువంటి మహిళలకు బ్యూటిషన్ పట్ల పూర్తి అవగాహనతో స్వయం ఉపాధి కల్పించే విధంగా వారికి సంభవ్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ట్రైనింగ్ బ్యూటీ అండ్ హెయిర్ కేర్ ట్రైనింగ్ సికింద్రాబాద్, సంగీత్ చౌరస్తా, నియర్ బై సెంటెన్స్ స్కూల్ ఆపోజిట్ కార్యాలయంలో కార్యనిర్వాహక అధ్యక్షురాలు మేనేజింగ్ డైరెక్టర్ వరలక్ష్మి బ్యూటిషన్ పై పూర్తి అవగాహన కలిగినటువంటి ట్రైనర్లతో దాదాపు 150 నుండి 175 వరకు 5 (గ్రూప్లు) బ్యాచ్లుగా విభజించి వారికి ఉచితంగా బ్యూటిషన్ కోర్సు నేర్పించడం జరుగుతుంది.

అలాగే శ్రీరామకృష్ణవేణి సేవా సొసైటీ మహిళ అధ్యక్షురాలు మరియు సుమిక్కు హెయిర్ అండ్ బ్యూటీ స్టూడియో నిర్వాహకురాలు (ప్రోపరేటర్) కొత్వాల్ సుష్మ వచ్చే ఉగాది పండుగ తెలుగువారి నూతన సంవత్సర పురస్కరించుకొని సంభవ్ ఫౌండేషన్ వారు మహిళలకు ఉచితంగా ట్రైనింగ్ చేస్తున్నటువంటి సేవలకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపి సంభవ్ ఫౌండేషన్ ద్వారా వచ్చే మహిళలకు వారికి అన్ని విధాలుగా సకల సౌకర్యాలు కల్పించి ఉచితంగా వారికి ట్రైనింగ్ మరియు స్వయం ఉపాధి (ప్లేస్మెంట్) కల్పించడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది.
భారతీయ జనతా మజ్దూర్ సాంగ్ దక్షిణ భారత అధికార ప్రతినిధి మరియు శ్రీరామకృష్ణవేణి సేవ సొసైటీ అధ్యక్షులు అలాగే తెలంగాణ స్టేట్ హోంగార్డ్స్ అధ్యక్షులు డాక్టర్ కొత్వాల్ దయానంద్ సంభవ్ ఫౌండేషన్ మహిళలను వంటింటికే పరిమితం కాకుండా సమాజ స్పృహతో పూర్తి అవగాహన కల్పిస్తూ బ్యూటిషన్ లో ఉచితంగా వారికి ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వపరంగా వారిని గుర్తించే విధమైనటువంటి సర్టిఫికెట్ ను ఇచ్చి స్వయం ఉపాధి కల్పించే విధంగా ప్లేస్మెంట్ వారికి అన్ని రకాలుగా చేయూతనిస్తూ వారికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సంభవ్ ఫౌండేషన్ వారి ఉచిత ట్రైనింగ్ సంబంధించిన బ్రోచర్ ను విడుదల చేసి సంతోషం వ్యక్తం చేశారు డాక్టర్ కొత్వాల్ దయానంద్.

శభాష్ పోలీస్ సిపిఆర్ చేసి బతికించారు

ట్రైనింగ్ లో ఉన్న మహిళలతో జరిగిన సంభాషణలో సమాజంలో మహిళల పట్ల ప్రజలు గౌరవ మర్యాదలతో మమేకమైతు మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో ముందుకు రావాలని అలాగే అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు సమయస్ఫూర్తితో ఆలోచించి ఆదర్శ స్ఫూర్తిమహిళలైనా వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి” రాణి రుద్రమదేవి” ప్రతిభా పాటిల్ అలాగే ఇందిర గాంధీ” అంతరిక్ష యోధురాలు సునీత విలియమ్స్” కరణం మల్లేశ్వరి” పి టి ఉష” సైనా నెహ్వాల్, కిరణ్ బేడి, ఉమిత్ బిన్ జోషి ఇలాంటి విప్లవాత్మకైనా స్ఫూర్తి మహిళలని గుర్తించుకొని సమాజ స్పృహతో సమాజం పట్ల పూర్తి అవగాహనతో సరైన నిర్ణయాలు తీసుకొని మీ జీవితం సుఖాంతం చేసుకోవాలని చెప్పారు డాక్టర్ కొత్వాల్ దయానంద్.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంభవ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వరలక్ష్మి, మరియు శ్రీరామకృష్ణవేణి సొసైటీ అధ్యక్షులు మరియు మహిళ అధ్యక్షురాలు శ్రీ కొత్వాల్ సుష్మ దయానంద్, ట్రైనింగ్ ప్రతినిధిలు ఠాకూర్ యోగిత, సుమలత, సరోజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *