
• ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. పటాన్ చెర్వు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను, స్టేషన్ రికార్డ్లను తనిఖీ చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వర్టికల్ కు ఒక అధికారిని నియమించాలని యస్.హెచ్.ఓ కు సూచనలు చేశారు. ప్రతి రికార్డ్ అప్ టు డేట్ ఉండాలని అన్నారు. అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ భాద్యతాయుతంగా విధులు నిర్వహించి, జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పటాన్ చెర్వు హైదరాబాద్ పరీవాహక ప్రాంతం కావున అధిక ట్రాఫిక్ రద్దీ అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయడం, సంబంధిత అధికారులతో మాట్లాడి బోలార్డ్స్ వేయించడం, విజిబుల్ పోలిసింగ్ వంటి కార్యక్రమాలు చేపటాలని అన్నారు. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, యస్.హెచ్.ఒ కు పలు సూచనలు చేశారు. ఈ విజిటింగ్ లో ఎస్పీ వెంబడి అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, పటాన్ చెర్వు డియస్పి రవీందర్ రెడ్డి, పటాన్ చెర్వు ఇన్స్పెక్టర్స్ వినాయక్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ లాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు.