Delhi High Court: జడ్జి కొంపముంచిన అగ్నిప్రమాదం! ఇళ్లంతా నోట్ల కట్టలే.. ఫైర్ సిబ్బంది షాక్! అంతా బ్లాక్ మనీ..
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక దళం భారీ మొత్తంలో నగదును కనుగొంది.
ఈ ఘటన తరువాత, ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అక్రమార్జన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది, అభిశంసన ప్రక్రియ కూడా పరిశీలనలో ఉంది.
న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడటానికి ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కొలీజియం కోరింది.
మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్ సిబ్బందికి కళ్లు బైర్లు కమ్మేలా ఇళ్లంతా నోట్ల కట్టలే కనిపించాయి. అది చూసి వాళ్లు షాక్ అయ్యారు.
అదంతా ప్రభుత్వానికి లెక్క చూపని డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
మరి ఈ విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.