బ్రేకింగ్ న్యూస్
రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్
Telangana

రాయికోడ్‌లో బైక్ దొంగ అరెస్ట్.. 1 బైక్, 2 ఆటోలు స్వాధీనం

రాయికోడ్‌లో బైక్ దొంగ అరెస్ట్.. 1 బైక్, 2 ఆటోలు స్వాధీనం

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుండి 1 బైక్‌తో పాటు 2 ఆటో రిక్షాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన రాయికోడ్ ఎస్ఐ ఎం. చైతన్య కిరణ్ మరియు పోలీస్ సిబ్బంది పనితీరును జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల మే 9న సంగాపూర్ గ్రామానికి చెందిన కాపాడి సుమన్ గౌడ్ తన ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని రాయికోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించారు.

అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడి వద్ద నుంచి 1 బైక్ మరియు 2 ఆటో రిక్షాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్

అరెస్టైన నిందితుడు నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామానికి చెందిన పండరి గౌడ్‌గా గుర్తించారు. నిందితుడిపై గతంలో కూడా పలు చోరీ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏటీఎం చోరీ కేసు, నారాయణఖేడ్ పరిధిలో బంగారు ఆభరణాల చోరీ కేసు, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయ చోరీ కేసులతో పాటు మరికొన్ని కేసుల్లో కూడా అతడు నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు.