బ్రేకింగ్ న్యూస్
రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్
Telangana

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పోలీసుల ప్రత్యేక నిఘా

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పోలీసుల ప్రత్యేక నిఘా

రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణ : ఎస్పీ స్నేహ మెహ్రా

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు రెవెన్యూ, వ్యవసాయ శాఖలతో సమన్వయం చేసుకుంటూ వివిధ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు (PPCలు), రైస్ మిల్లులను విస్తృతంగా సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సక్రమంగా కొనుగోలు చేయించే దిశగా పోలీస్ శాఖ అన్ని విధాల సహకారం అందిస్తోందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, మధ్యవర్తుల జోక్యం లేకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కొనుగోలు కేంద్రాల వద్ద అధిక రద్దీ, ట్రాఫిక్ సమస్యలు, ధాన్యం రవాణాలో జాప్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎస్పీ స్థాయి అధికారులకు సూచనలు జారీ చేసినట్లు వెల్లడించారు. రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ పికెటింగ్, నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.

జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికారులు కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను తనిఖీ చేసి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తూకం ప్రక్రియ, నిల్వలు, రవాణా సౌకర్యాలు, తేమ శాతం పరీక్షలు, ధాన్యం అన్‌లోడింగ్, పాత ధాన్యం క్లియరెన్స్ తదితర అంశాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.

రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్

రైతులకు ఎలాంటి ఆలస్యం లేకుండా ధాన్యం స్వీకరణ చేపట్టాలని రైస్ మిల్లుల యాజమాన్యాలకు అధికారులు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా పోలీస్ యంత్రాంగం భరోసా కల్పించింది.

కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు ఎదురైనా సమీప పోలీస్ అధికారులకు లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.