బ్రేకింగ్ న్యూస్
ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్
Telangana

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి సంగారెడ్డి ప్రత్యేక పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రత్యేక పోక్సో న్యాయమూర్తి ఆర్. శ్రీలేఖ విచారణ అనంతరం నిందితుడిని దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేశారు.

ఈ కేసులో నిందితుడు శాంసన్ @ మేథారి శాంసన్‌పై క్రైమ్ నం.45/2023 కింద ఐపీసీ సెక్షన్లు 366, 376(2)తో పాటు పోక్సో చట్టం సెక్షన్ 3 & 4 ప్రకారం కేసు నమోదు చేశారు. విచారణలో ఆరోపణలు రుజువుకావడంతో కోర్టు నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.8,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 5 నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

నిందితుడు శాంసన్ (20), వృత్తి ఎలక్ట్రిషియన్ మరియు సెంట్రింగ్ పనులు చేస్తూ, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా రాజగిరా ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం

ఈ కేసును సమర్థవంతంగా నడిపించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. సూర్యరెడ్డి, దర్యాప్తు అధికారి కె. నవీన్ కుమార్, ఎస్‌హెచ్‌వో డి. వెంకటేష్, సదాశివపేట పోలీస్ సిబ్బంది, కోర్టు లైజనింగ్ అధికారులు శంకర్, సత్యనారాయణలను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారు.