బ్రేకింగ్ న్యూస్
ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్
Telangana

వేసవిలో జాగ్రత్తలు అవసరం: ఈత సరదా విషాదంగా మారకూడదు – మైనర్‌లకు వాహనాలు ఇవ్వొద్దు

వేసవిలో జాగ్రత్తలు అవసరం: ఈత సరదా విషాదంగా మారకూడదు – మైనర్‌లకు వాహనాలు ఇవ్వొద్దు

వేసవికాలం ప్రారంభమవడంతో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు, యువకులు బయట కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఈత నేర్చుకునేందుకు చెరువులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు.

ఈత సరదా విషాదంగా మారకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈత రాని వారు ఒంటరిగా బావులు, చెరువులు, కాలువల వద్దకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఈత నేర్చుకునే వారు తప్పనిసరిగా తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే ఉండాలని సూచించారు.

తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, ముఖ్యంగా చెరువులు, కాలువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే పిల్లల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు.

అదే విధంగా, మైనర్‌లకు వాహనాలు ఇవ్వడంపై కూడా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మైనర్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇది వారికి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదకరమని తెలిపారు. మైనర్‌కు వాహనం ఇచ్చిన యజమానిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం

పిల్లల భద్రత తల్లిదండ్రుల బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చని జిల్లా ఎస్పీ సూచించారు.