బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Telangana

తెలంగాణలో మీ సేవా కేంద్రాల్లో ఏసీబీ సడెన్ తనిఖీలు… అనేక అక్రమాలు బట్టబయలు

తెలంగాణలో మీ సేవా కేంద్రాల్లో ఏసీబీ సడెన్ తనిఖీలు… అనేక అక్రమాలు బట్టబయలు

వార్త:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సడెన్ తనిఖీలు నిర్వహించి అనేక అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. ఏప్రిల్ 15న హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో మొత్తం 13 మీ సేవా కేంద్రాల్లో ఈ తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీలలో పలు అవకతవకలు గుర్తించబడ్డాయి. అల్వాల్ ప్రభుత్వ మీ సేవా కేంద్రం వద్ద ఖాళీగా ఉన్న కుల, ఆదాయం, నివాస ధృవపత్రాలు, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్లు, నోటరీ స్టాంప్ ఉన్న పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఉపయోగించి నకిలీ పత్రాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

అలాగే, మీ సేవా కేంద్ర సిబ్బంది మరియు అనధికార మధ్యవర్తుల మధ్య యూపీఐ లావాదేవీలు, వాట్సాప్ చాట్స్ ఉన్నట్లు ఆధారాలు లభించాయి. దరఖాస్తుదారుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు కూడా వెల్లడైంది. ఖమ్మం కేంద్రంలో అధికారం లేని వ్యక్తులు సర్టిఫికెట్లపై సంతకాలు చేస్తున్నట్లు గుర్తించారు.

సరూర్‌నగర్‌లోని ఒక కేంద్రంలో ఖాళీ నోటరీ పేపర్లు, ముందుగా సంతకం చేసిన బాండ్ పేపర్లు, వేర్వేరు లైసెన్స్ హోల్డర్ల లాగిన్ ఐడీలు దొరికాయి. తార్నాకా ప్రాంతంలో ప్రతి దరఖాస్తుపై నోటరీ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు బయటపడింది. సంగారెడ్డిలో స్టాంప్ పేపర్ అమ్మకాల రిజిస్టర్లు నిర్వహించకపోవడం గమనించారు.

దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్

సూర్యాపేటలో ఇతర కేంద్రాల సర్టిఫికేట్ బాండ్లు, అలాగే అభ్యర్థులకు ఇవ్వాల్సిన అసలు సర్టిఫికెట్లు నిల్వలో ఉండటం కూడా గుర్తించారు. ఈ వ్యవహారాల్లో మధ్యవర్తుల ప్రమేయం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనలపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని, సంబంధిత కేంద్రాలపై చర్యల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ప్రజా సేవకులు లంచం కోరితే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ సూచించింది.