బ్రేకింగ్ న్యూస్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్
Hyderabad

వీర హనుమాన్ విజయ యాత్రకు హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత: 3,000 మంది పోలీసులతో బందోబస్తు

వీర హనుమాన్ విజయ యాత్రకు హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత: 3,000 మంది పోలీసులతో బందోబస్తు

హైదరాబాద్, ఏప్రిల్ 02: శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. గౌలిగూడ రామమందిరంలో నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఐపీఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం నలుమూలల నుంచి మొత్తం 168 ఊరేగింపులు తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వరకు సాగనున్నాయని తెలిపారు. కర్మన్‌ఘాట్ నుంచి ఇప్పటికే ప్రధాన యాత్ర ప్రారంభమైనట్లు వెల్లడించారు.

🚨 భారీ భద్రతా ఏర్పాట్లు

యాత్ర ప్రశాంతంగా జరిగేలా 3,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.

📹 సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘా

యాత్ర సాగే మార్గమంతా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతోందని, ఇవన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించామని తెలిపారు. అదనంగా డ్రోన్ల ద్వారా కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

🚦 ట్రాఫిక్ ఆంక్షలు

యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని కోరారు.

శ్రీరామనవమి శోభాయాత్రను విజయవంతం చేసినట్లే, ఈ హనుమాన్ యాత్రను కూడా భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో నిర్వహించాలని ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ ఎం. శ్రీనివాసులు, డిసిపి గోల్కొండ జోన్ జి. చంద్ర మోహన్, డిసిపి ట్రాఫిక్ అవినాశ్ కుమార్, డిసిపి ట్రాఫిక్ కాజల్, అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.