బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

జిల్లాలో ఇప్పటివరకు 12 కేసులు నమోదు: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.ఐపీఎస్.

జిల్లాలో ఇప్పటివరకు 12 కేసులు నమోదు: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.ఐపీఎస్.

బాధితుల వద్దకే ఆన్సైట్ ఎఫ్ఐఆర్ ద్వారా కేసుల నమోదు.

సంఘటనా స్థలంలోనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(FIR).

జిల్లాలో ఇప్పటివరకు 12 కేసులు నమోదు: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.ఐపీఎస్.

ప్రజలకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన పోలీస్ సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ కీలక ముందడుగు వేసిందని జిల్లా ఎస్పీ తెలిపారు. రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, వారి వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసే “ఆన్సైట్ ఎఫ్ఐఆర్” విధానాన్ని జిల్లా వ్యాప్తoగా అమలు చేస్తున్నామన్నారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్

నేరం జరిగిన తరువాత శారీరకంగా,మానసికంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ఒక భారంగా మారకూడదనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ విధానం అమలులో ఉందని తెలిపారు.ఇప్పటికే ఈ విధానం ద్వారా జిల్లాలో 12 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల వద్ద నుంచే ఫిర్యాదును స్వీకరిస్తారు.ఫిర్యాదుదారులు డయల్ 100కు కాల్ చేసినా, నేరుగా సమాచారం ఇచ్చినా వెంటనే స్పందించి ట్యాబ్‌ల ద్వారా ఆన్లైన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు.రోడ్డు ప్రమాదాలు,గొడవలు వంటి ఘటనల్లో గాయపడిన వారికి తక్షణ వైద్యసాయం అందిస్తూ ఆసుపత్రికి తరలిస్తారు. ఈ ఆన్సైట్ ఎఫ్ఐఆర్ విధానం ద్వారా రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దొంగతనాలు, భార్యాభర్తల వివాదాలు, వేధింపులు, అనుమానాస్పద మృతులు వంటి కేసులను సంఘటనా స్థలంలోనే తక్షణం నమోదు చేసే అవకాశం కలుగుతుంది.ఈ విధానం ద్వారా బాధితులకు త్వరిత న్యాయం అందించడమే కాకుండా, పోలీస్ సేవలపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.