బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Uncategorized

తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్–2026లో మహబూబాబాద్ పోలీసుల సత్తా

తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్–2026లో మహబూబాబాద్ పోలీసుల సత్తా

19 పతకాలతో జిల్లా ప్రతిష్టను నిలబెట్టిన సిబ్బంది – ఎస్పీ డా. శబరీష్ అభినందనలు

మహబూబాబాద్: హైదరాబాద్‌లో నిర్వహించిన Telangana Police Sports and Games Meet 2026లో మహబూబాబాద్ జిల్లా పోలీస్ సిబ్బంది విశేష ప్రతిభ కనబరచి మొత్తం 19 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డా. శబరీష్ విజేతలను ఘనంగా సత్కరించారు. శాలువాలు కప్పి ప్రశంసాపత్రాలు అందజేసి వారి ప్రతిభను కొనియాడారు.

పతక విజేతలు

  • ఎం. శ్రీనివాస్, డిఎస్పీ (ఏఆర్) – లాన్ టెన్నిస్ టీమ్ ఈవెంట్ – స్వర్ణ పతకం
  • విజయ్ ప్రతాప్, డిఎస్పీ (ఏఆర్) – లాన్ టెన్నిస్ టీమ్ ఈవెంట్ – స్వర్ణ పతకం
  • ఎం. లింగన్న, పీసీ – 42 కి.మీ ఫుల్ మారథాన్ – స్వర్ణ పతకం; క్రాస్ కంట్రీ ఇండివిడ్యువల్ – రజత పతకం
  • బి. గణేష్, ఏఆర్‌పీసీ – ఆర్మ్ రెజ్లింగ్ – కాంస్య పతకం
  • బి. సౌభాగ్య, మహిళా పీసీ – జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ – స్వర్ణ పతకం; ట్రెడిషనల్ యోగా – కాంస్య పతకం
  • ఎ. ఉమా రాణి, మహిళా పీసీ – క్రాస్ కంట్రీ టీమ్ ఈవెంట్ – స్వర్ణ పతకం; ఖో-ఖో – కాంస్య పతకం
  • జి. రజిని, మహిళా పీసీ – రిథమిక్ పేర్ యోగా – కాంస్య పతకం; ఖో-ఖో – కాంస్య పతకం
  • ఎం. సంజీత, మహిళా పీసీ – ఆర్టిస్టిక్ సింగిల్ యోగా – కాంస్య పతకం
  • కె. అనూష, మహిళా పీసీ – ఖో-ఖో మహిళల విభాగం – కాంస్య పతకం
  • ఎల్. దివ్య, మహిళా పీసీ – ఖో-ఖో మహిళల విభాగం – కాంస్య పతకం
  • బి. సౌజన్య, మహిళా పీసీ – ఖో-ఖో మహిళల విభాగం – కాంస్య పతకం

ఈ పోటీల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసులు మొత్తం 6 స్వర్ణ పతకాలు, 3 రజత పతకాలు, 10 కాంస్య పతకాలు సాధించి రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రతిష్టను నిలబెట్టారు.

ఈ సందర్భంగా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ, విధి నిర్వహణతో పాటు క్రీడలలో కూడా ప్రతిభ కనబరచడం పోలీస్ సిబ్బంది క్రమశిక్షణ, శారీరక మరియు మానసిక దృఢత్వానికి నిదర్శనమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలని విజేతలను ప్రోత్సహించారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్

ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.