Breaking News

తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లా సత్తా

21 పతకాలతో మెరిసిన జిల్లా క్రీడాకారులు – అభినందించిన ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వారం రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. మొత్తం 21 పతకాలు సాధించి జిల్లాను రాష్ట్ర స్థాయిలో ముందువరుసలో నిలిపారు. వీటిలో 6 బంగారు, 8 రజత, 7 కాంస్య పతకాలు ఉన్నాయి.

జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ విజేతలకు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రీడలు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గెలుపు–ఓటములు సహజమని, విజేతలు జాతీయ స్థాయిలో మరింత మెరుగైన ప్రదర్శనకు కృషి చేయాలని, ఓటమి చెందిన వారు నిరాశ చెందకుండా తమ లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాలని సూచించారు. జిల్లాకు గౌరవం తీసుకువచ్చిన క్రీడాకారులందరినీ అభినందించారు.

బంగారు పతక విజేతలు:

ఈడీ సజీవ్ – బ్యాడ్మింటన్ (50+) సింగిల్స్
బి ఆదిత్య – సాంప్రదాయ యోగా
బి ఆదిత్య – ఆర్టిస్టిక్ యోగా సింగిల్
ఆర్ సాయిరామ్ – వెయిట్ లిఫ్టింగ్ (60 కేజీలు)
కె జ్యోతి – పవర్ లిఫ్టింగ్
చి భాగ్యవతి – వెయిట్ లిఫ్టింగ్

రజత పతక విజేతలు:

ఈడీ సజీవ్ – బ్యాడ్మింటన్ (45+) డబుల్స్
జి సంతోష్ కుమార్ – తైక్వాండో (74–80 కేజీలు)
డి మధు – రెజ్లింగ్
ఎల్ చంద్రశేఖర్ – రెజ్లింగ్
ఎల్ చంద్రశేఖర్ – వెయిట్ లిఫ్టింగ్ (60 కేజీలు)
ఎన్ చంగున
కె శ్రావ్య – బ్యాడ్మింటన్
కె శ్రావ్య – వెయిట్ లిఫ్టింగ్

కాంస్య పతక విజేతలు:

కె శ్రావ్య – షాట్‌పుట్
వి దేవి సింగ్ – రెజ్లింగ్
కె సాయి తేజ గౌడ్ – బాక్సింగ్ (75–80 కేజీలు)
పి ప్రతాప్ రాథోడ్ – వెయిట్ లిఫ్టింగ్ (60 కేజీలు)
జె శివ కుమార్ – ఆర్టిస్టిక్ యోగా సింగిల్
ఎల్ రవి కుమార్ – రెజ్లింగ్ (77 కేజీలు)

ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ నరేందర్, ఆర్‌ఐ డానియెల్, రాజశేఖర్ రెడ్డి, ఆర్‌ఎస్‌ఐ శ్రీశైలం, అశోక్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *