బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Telangana

ఎక్సైజ్, ఎన్నికల చట్టాలపై పోలీసు అధికారులకు లీగల్ అవగాహన

ఎక్సైజ్, ఎన్నికల చట్టాలపై పోలీసు అధికారులకు లీగల్ అవగాహన

🔹 ఎక్సైజ్, ఎన్నికల చట్టాలపై పోలీసు అధికారులకు లీగల్ అవగాహన
🔹 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
🔹 మున్సిపాలిటీ ఎన్నికల భద్రతపై డీజీపీ గారి దృశ్య సమీక్ష
రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో దృశ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లా అదనపు ఎస్పీ రఘునందన్ రావ్ జిల్లాలోని పోలీస్ అధికారులతో కలిసి దృశ్య సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలను పూర్తిగా శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి పోలీసు అధికారి పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు.

ఈ సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ… నామినేషన్ దశ నుంచి పోలింగ్, కౌంటింగ్, ఫలితాల అనంతరం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. గత ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన వారు, రౌడీషీటర్లను సత్ ప్రవర్తన కోరుతూ ముందస్తుగా బైండోవర్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మండల, పోలీస్ స్టేషన్ వారీగా సమస్యాత్మక మరియు అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల రోజు మరియు కౌంటింగ్ రోజున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. విజేత ర్యాలీలపై కూడా ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు.


ఎక్సైజ్ & మున్సిపల్ ఎన్నికల చట్టాలపై లీగల్ రాష్ట్ర పోలీసు లీగల్ అడ్వైజర్ ఏపూరి రాములు చే పోలీసు అధికారులకు ఎక్సైజ్ చట్టాలు, మున్సిపల్ ఎన్నికల నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఎన్నికల సమయంలో అక్రమ మద్యం తయారీ, నిల్వ, రవాణా, అమ్మకాలకు సంబంధించిన నేరాలపై కఠినంగా వ్యవహరించాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు తావు లేకుండా చట్టపరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. చట్ట పరిధిలోనే సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఎన్నికల స్వచ్ఛతను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని ఆయన తెలిపారు.

నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఎలెక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, సదా నాగరాజు, ఎలెక్షన్ సెల్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.