బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Telangana

తొర్రూరులో 4.5 కిలోల గంజాయి స్వాధీనం – ఇద్దరు నిందితుల అరెస్ట్

తొర్రూరులో 4.5 కిలోల గంజాయి స్వాధీనం – ఇద్దరు నిందితుల అరెస్ట్

తొర్రూరు పోలీస్ స్టేషన్ SI-II ఎం. శివరామకృష్ణ, తమ సిబ్బందితో కలిసి 01.02.2026 ఉదయం తొర్రూరు బస్టాండ్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించారు. పెట్రోలింగ్ సమయంలో తొర్రుర్ బస్సు ప్లాట్‌ఫారం నంబర్–02 వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా గమనించి, వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో వారు విశాఖపట్నం నుండి హైదరాబాద్‌కు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు వెల్లడైంది.
వీరిరువురు హైదరాబాద్‌లో నివసిస్తూ గంజాయి తాగే అలవాటుకు బానిసలయ్యారు. విశాఖపట్నంలో గంజాయి సులభంగా లభిస్తుందని తెలుసుకుని, గతంలో మూడు సార్లు అక్కడికి వెళ్లి గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చి కొంత స్వయంగా వినియోగిస్తూ, మిగిలినదాన్ని ఇతరులకు విక్రయించేవారు.
ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం విశాఖపట్నం వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, రైల్వే మార్గంలో తనిఖీలు ఎక్కువగా ఉంటాయని భావించి బస్సు మార్గాన్ని ఎంచుకున్నారు. విశాఖపట్నం నుండి విజయవాడ–ఖమ్మం మీదుగా తొర్రూరుకు చేరుకొని, అక్కడి నుండి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులను అరెస్ట్ చేసి, వారిని జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

4.555 కిలోలు (విలువ సుమారు రూ. 2,27,500/-) గంజాయి,రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇలాంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తారని ఈ సందర్భంగా డిఎస్పీ కృష్ణకిషోర్ హెచ్చరించారు.

నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు