బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Telangana

దారి దోపిడి కేసును చేదించిన జహీరాబాద్ పోలీసులు..

దారి దోపిడి కేసును చేదించిన జహీరాబాద్ పోలీసులు..


• సుమారు 4.70 లక్షల విలువ గల దొంగ సొత్తు స్వాధీనం, నిందితుల రిమాండ్..
• కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ
పరితోష్ పంకజ్.
సంగారెడ్డి జిల్లా: వివరాల్లోనికి వెళితే: తేదీ 22.01.2026 నాడు సాయంత్రం సుమారు 7:30 గంటల సమయంలో ఫిర్యాది ఆదర్శనగర్ కాలనీలో గల తన ఇంటికి వెళ్తుండగా పల్సర్ బైక్ పైన వచ్చిన ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించే ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల పుస్తెలతాడును దొంగిలించుకుని వెళ్లారని జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు చేయగా కేసు నమోదు చేయడం జరిగింది.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశానుసారం జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ శివలింగం, టౌన్ ఎస్ఐ వినయ్ కుమార్, ఐడి పార్టీ సిబ్బందితో కూడిన బృందాలను ఏర్పాటు చేసి కేసు చేదించడానికి ముమ్మర తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో భాగంగా ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో జహీరాబాద్ పట్టణంలో అల్గోల్ చౌరస్తా వద్ద గల మెహెఫీల్ హోటల్ వద్ద ఎస్ఐ వినయ్ కుమార్, ఐడి పార్టీ సిబ్బందితో వాహన తనిఖీ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్ పైన సంగారెడ్డి వైపు నుండి వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకొని విచారించగా ఆదర్శనగర్ కాలనీలో దారి దోపిడీకి పాల్పడినది తామేనాని అంగీకరించారు. నిందితుల నుండి 2.5 తులాల పూసతెల తాడు, 2-కత్తులు, 1-పల్సర్ బైక్ స్వాదినం చేసుకొని జుడీషియల్ రిమాండుకు తరలించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు జహీరాబాద్ డిఎస్పీ సైదా నాయక్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం స్పెషల్ టీం లను ఏర్పాటు చేసి, సాంకేతిక పరిజ్ఞానం, సిసి టీవీల ఆదారంగా నిందితులను ఛేదించడం జరిగిందని అన్నారు. జిల్లా ప్రజలు సిసి టీవీల ప్రాధాన్యతను గుర్తించి, సిసిటీవి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్ఐ వినయ్ కుమార్, ఐడి పార్టీ సిబ్బందిని అభినందించి, రివార్డ్ లకు ప్రపోసల్ పంపించడం జరుగుతుంది అన్నారు.

నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు