బ్రేకింగ్ న్యూస్
గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్
Telangana

గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలు

గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలు

ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం నిర్వహణకు ప్రత్యేక భద్రతా చర్యలు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్

నల్లగొండ: జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ డైవర్షన్లు సహా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు.

గణేష్ విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక నిమజ్జన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు ముందుగానే తమ విగ్రహాల ఎత్తును పరిశీలించుకుని, నిర్దేశించిన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలకు అనుగుణంగా రూట్ ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

విగ్రహాల ఎత్తును బట్టి నిమజ్జన మార్గాలు

🔹 10 అడుగుల ఎత్తు వరకు ఉన్న విగ్రహాలు: బతుకమ్మ కుంట లేదా వల్లభరావు చెరువులో నిమజ్జనం చేసుకోవాలి.

🔹 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలు: క్లాక్ టవర్ – రామగిరి – పానగల్ ఫ్లైఓవర్ – తిప్పర్తి – వేములపల్లి మార్గం ద్వారా వేములపల్లి కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రదేశానికి చేరుకోవాలి.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం

14వ మైలు, హాలియా వైపు భారీ విగ్రహాలకు అనుమతి లేదు

సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) ఉన్నందున, 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న గణేష్ విగ్రహాలను ఈ ఏడాది 14వ మైలు, హాలియా వైపు అనుమతించబోమని ఎస్పీ స్పష్టం చేశారు.

పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి

నిమజ్జన సమయంలో భక్తులు, నిర్వాహకులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనలకు అనుగుణంగా ఊరేగింపులు నిర్వహించాలని కోరారు.

అలాగే డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, మద్యం సేవించి గణేష్ ఊరేగింపుల్లో పాల్గొనరాదని స్పష్టం చేశారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.

జీరో యాక్సిడెంట్ – జీరో ఇన్సిడెంట్ లక్ష్యం

ఈ ఏడాది “జీరో యాక్సిడెంట్ – జీరో ఇన్సిడెంట్” లక్ష్యంతో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ కోరారు.