సంగారెడ్డి: గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలనకు వెళ్తున్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించారు.
18.09.2026న మధ్యాహ్నం సుమారు 1:15 గంటల సమయంలో సదాశివపేట మండలం నందికంది గ్రామ సమీపంలోని జాతీయ రహదారి–65పై రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎస్పీ వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు సిబ్బంది, స్థానికుల సహకారంతో ప్రాథమిక సహాయం అందించి, పోలీసు వాహనం మరియు అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.
ప్రమాదంలో కంది గ్రామానికి చెందిన శివలీల, కొండాపూర్ మండలం ఉత్తర్పల్లికి చెందిన ఆటో డ్రైవర్ బి. సంతోష్, బీదర్ జిల్లాకు చెందిన బైక్ రైడర్ ఎన్. అమర్ గాయపడ్డారు.
ఈ సందర్భంగా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.
