హైదరాబాద్‌లోని చిలకల్గూడ పోలీసులు మైలార్‌గడ్డలో జరిగిన క్రూర హత్య కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇమ్మడి శ్రీనివాస్‌పై కత్తితో దాడి చేసి హత్య చేసిన కేసులో భోలక్‌పూర్‌కు చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ అలియాస్ నిజాం (36)ను సెప్టెంబర్ 16న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై చిలకల్గూడ పోలీస్ స్టేషన్‌లో Cr.No.459/2026 కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 15న సాయంత్రం శ్రీనివాస్ తన యాక్టివా వాహనంపై మద్యం తీసుకురావడానికి వైన్ షాప్‌కు బయలుదేరాడు. రాత్రి 7:10 నుంచి 7:20 గంటల మధ్య మైలార్‌గడ్డ రోడ్డుపై నిందితుడు ఆయనపై కత్తితో దాడి చేసి పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను తొలుత ఆర్టీసీ ఆసుపత్రికి, అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడి కుమారుడు సుమన్‌కు, నిందితుడు నిజాముద్దీన్‌కు గతంలో పరిచయం ఉండటంతో పాటు వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో నష్టాల కారణంగా సుమన్ అప్పులు చేసి 2023 నవంబర్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. అనంతరం తనకు రావాల్సిన డబ్బు చెల్లించాలని నిజాముద్దీన్ డిమాండ్ చేయడంతో పాటు, ఆర్థిక వివాదానికి సంబంధించి సివిల్ కేసు కూడా దాఖలు చేసినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌పై దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి నేరానికి ఉపయోగించి
