బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Telangana

నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు

నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు

పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక.. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్

పోలీస్ స్టేషన్, డీఎస్పీ కార్యాలయ రికార్డుల నిర్వహణపై పరిశీలన.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్, 2026 సెప్టెంబర్ 22న నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్, కార్యాలయాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు.

నాగల్గిద్ద పోలీస్ స్టేషన్‌లో తనిఖీలు

నాగల్గిద్ద పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న జిల్లా ఎస్పీకి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం డీఎస్పీతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది కిట్ ఆర్టికల్స్, రికార్డుల నిర్వహణను పరిశీలించారు.

పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న స్వాధీనం చేసుకున్న, కేసులకు సంబంధించిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసులకు సంబంధించిన ఆస్తులను కోర్టులో సమర్పించే వరకు జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు.

ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, మిస్సింగ్ కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఆస్తి సంబంధిత నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను క్రైమ్ ప్రోన్ ఏరియాలు, బ్లాక్ స్పాట్లుగా గుర్తించి పగలు, రాత్రి బీట్ విధుల్లో నిఘా పెంచాలని సూచించారు.

రాష్ట్ర సరిహద్దుల నుంచి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు సూచించారు.

సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలి

పోలీస్ సిబ్బంది సీసీటీఎన్ఎస్-2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్, దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ పోర్టల్, సీడీఆర్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి సాంకేతిక అప్లికేషన్లపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ సూచించారు.

స్టేషన్ రికార్డుల్లో పార్ట్-1 నుంచి పార్ట్-5 వరకు ఎలాంటి పెండింగ్ లేకుండా సీసీటీఎన్ఎస్-2.0లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు.

ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరిస్తామనే భరోసా కల్పించాలని ఎస్పీ సూచించారు.

విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, గ్రామ పెద్దలు, యువతతో సత్సంబంధాలు ఏర్పరచుకుని శాంతిభద్రతలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలని తెలిపారు.

స్టేషన్ పరిధిలోని హిస్టరీ షీటర్లు, అనుమానితుల వివరాలపై అవగాహన కలిగి ఉండాలని, పగలు, రాత్రి బీట్ విధుల్లో తనిఖీలు నిర్వహిస్తూ వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు.

పాపిలాన్ డివైస్‌ను వినియోగిస్తూ అనుమానిత వ్యక్తులను తనిఖీ చేయాలని, వేలిముద్రల ఆధారంగా పాత నేరస్తులను గుర్తించే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

సిబ్బంది ప్రతి ఒక్కరూ అన్ని రకాల విధులపై అవగాహన కలిగి ఉండాలని, తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. విధులకు సంబంధించి లేదా వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.

నల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రత

నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో సమీక్ష

అనంతరం జిల్లా ఎస్పీ నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణను పరిశీలించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పోక్సో కేసులు, అత్యాచార కేసులు, వరకట్న మరణాల కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి కేసులో చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ సమగ్ర దర్యాప్తు జరిగేలా సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని డీఎస్పీకి తెలిపారు.

ప్రతి నెల తప్పనిసరిగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహించాలని, అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి అవసరమైన చోట సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు.

జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాల్లో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ఇంజినీరింగ్‌లో లోపాలు ఉంటే జాతీయ రహదారుల అధికారులతో (NHA) మాట్లాడి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

నేరాల ఛేదన, నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.

రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం

నారాయణఖేడ్ ప్రాంతం ఇతర రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉన్నందున అక్రమ రవాణా జరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం చేయాలని ఎస్పీ సూచించారు.

నాకాబందీ వంటి తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా రైతులు గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత భూమిని జప్తు చేసేందుకు సిఫారసు చేయాలని డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

అధికారుల పనితీరుపై ఎస్పీ అభినందనలు

నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది పనితీరును ప్రత్యేకంగా అభినందించారు.

విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.

ఈ వార్షిక తనిఖీల సందర్భంగా జిల్లా ఎస్పీ వెంట నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, నారాయణఖేడ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కంగ్టీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి, సబ్ డివిజన్ ఎస్‌ఐలు ఉన్నారు.