బ్రేకింగ్ న్యూస్
డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షడబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్ష
Hyderabad

సైబర్ నేరాలకు ఇక స్వస్తి.. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” ఆరు వారాల ప్రత్యేక కార్యక్రమాలు..

సైబర్ నేరాలకు ఇక స్వస్తి.. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” ఆరు వారాల ప్రత్యేక కార్యక్రమాలు..

• సైబర్ నేరాలకు ఇక స్వస్తి.. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” ఆరు వారాల ప్రత్యేక కార్యక్రమాలు..
• “పైసా పైలాం” అనే అంశంపై గీతం విశ్వవిద్యాలయం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన..
• ముఖ్య అతిథిగా హాజరైన అధికారి హర్షవర్ధన్ ఐపిఎస్..
• ఆత్మీయ అతిథిగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్..

తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) సహకారంతో, సంగారెడ్డి జిల్లా రుద్రారం గీతం విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్ధన్, ఐపిఎస్, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ 6-వారాల కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాల గురించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన పెంచడం జరుగుతుంది అన్నారు. వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాల వలన కలుగుతున్న పరిణామాలు, సైబర్ నేరస్థులు ఉపయోగించే మోసపూరిత పద్ధతులను వివరించడం జరిగింది. సైబర్ మోసగాళ్ళు సంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, మొబైల్ ఫోన్ లలో హానికరమైన సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసే అవకాశం ఉందని, తద్వారా బ్లాక్ మెయిల్, దోపిడీ, డేటా దుర్వినియోగానికి దారితీయవచ్చు అన్నారు. ఆన్ లైన్ గేమింగ్స్, ఆన్ లైన్ బెట్టింగ్ (ఇది తెలంగాణాలో నిషేధించారు), ఆన్ లైన్ చాటింగ్ లో పాల్గొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలని, పెరిగిన సాంకేతికతను చెడు మార్గంలో వినియోగిస్తున్న సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలే లక్ష్యంగా ఓటీపీ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్టు, హానికరమైన ఏపీకే ఫైల్స్, నకిలీ సోషల్ మీడియా ప్రొఫైళ్లతో సహా, ప్రజలను ఆకర్షితులు చేసే వివిధ రకాల ఆన్ లైన్ మోసాల గురించి విద్యార్థులకు వివరించారు. సైబర్ మోసానికి గురి అయినట్లు గమనించిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేసి లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ నోడల్ అధికారి డీఎస్సీ కే.వీ. సూర్యప్రకాశ్, బీటెక్ తొలి ఏడాది సమన్వయకర్త ప్రొఫెసర్ పి.త్రినాథరావు, సంగారెడ్డి అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, పటాన్ చెర్వు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవి, ఇన్స్పెక్టర్ సదా నాగరాజు కళాశాల యాజమాన్యం విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు