Breaking News

జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు స్వేచ్చగా వినియోగించుకోండి — ఎస్పీ డా శబరీష్..

జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు స్వేచ్చగా వినియోగించుకోండి — ఎస్పీ డా శబరీష్..

గ్రామపంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ జిల్లా పరిధిలో కంబాలపల్లి గ్రామాన్ని సందర్శించి అనంతరం కురవి లో ఏర్పాటు చేసిన గ్రామ సభాలో పాల్గొన్నారు..

గ్రామాలను సందర్శించి భద్రతా చర్యలను పరిశీలించారు. జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులు, ఆయా గ్రామాలకు సంబంధిత VPO (విలేజ్ పోలీస్ అధికారి )లతో కలిసి గ్రామ వీధుల్లో తిరిగి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

సీసీ కెమెరాలు & భద్రతా చర్యల పరిశీలన

జిల్లా ఎస్పీ ముందుగా గ్రామంలోని కీలకచోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల స్థితి, కవరేజ్ ఏరియా తదితర విషయాలను వివరంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు ఎన్నికల సమయంలో గ్రామంలో జరిగే ప్రతి కదలికపై నిఘా పెట్టడానికి ఎంతో ఉపయోగకరమని, పనిలో లేని లేదా డ్యామేజ్ అయిన కెమెరాలను వెంటనే మార్చాలని అధికారులు బాధ్యతగా తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే గ్రామంలో సెన్సిటివ్, హై సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

రోడీలు – అనుమానితులపై ప్రత్యేక నిఘా

గ్రామాల్లో సమస్యలు సృష్టించే వారు రౌడీ షీట్స్ ఉన్న వ్యక్తులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఎన్నికల సందర్భంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే స్ధానిక రోడీలు, చరిత్రగల వ్యక్తులు, మద్యం మరియు డబ్బు పంపిణీ చేసే అనుమానితులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.వారిని నిరంతరం కౌన్సెలింగ్ చేయించి పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. “ఎన్నికలకు ఆటంకం కల్పించే ఎలాంటి ప్రయత్నాలనూ పోలీసు శాఖ సహించదు’’ అని ఆయన స్పష్టం చేశారు.

నల్లగొండ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ..

గ్రామస్తులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఎస్పీ
ఎస్పీ గ్రామస్తులతో ప్రత్యక్షంగా సమావేశమై, స్వేచ్ఛా, నిష్పాక్షిక ఎన్నికల ప్రాధాన్యత గురించి జాగృతి కల్పించారు.

వారితో మమేకమై ప్రతి ఓటరు ధైర్యంగా, ఎవరి ప్రభావం లేకుండా తన అభిమతానికి అనుగుణంగా ఓటు వేయాలని ప్రోత్సహించారు.

ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, కిరాణా, బహుమతుల రూపంలో ప్రలోభాలు తీసుకోవడం కూడా చట్టపరంగా నేరమని వివరించారు.

గ్రామంలో శాంతిని భంగం చేసే ఏవైనా పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను కోరారు.

యువత సమాజంలో మార్పుకు దారి చూపే శక్తిగా పేర్కొంటూ, వారు అక్రమ పద్ధతులకు దూరంగా ఉండి స్వచ్ఛమైన ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని సూచించారు.

ఎన్నికల రోజున గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా
ప్రత్యేక మొబైల్ పట్రోలింగ్,సీసీ కెమెరాల పర్యవేక్షణ,అదనపు సిబ్బంది నియామకం,24/7 కంట్రోల్ రూమ్ మానిటరింగ్ వంటి అన్ని ఏర్పాట్లు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఎస్పీ తెలిపారు.
జిల్లాలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా, న్యాయంగా జరిగేలా పోలీసుశాఖ అంకితభావంతో పనిచేస్తుందని ఎస్పీ డా. శబరీష్ ప్రజలకు హామీ ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *