గ్రామ పంచాయితీ ఎన్నికలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం
ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి జిల్లా యస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్
ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి ..
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికలు ప్రశాంత ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా గ్రామస్తులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఎస్పీ అన్నారు.

గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నార్కట్ పల్లి, యల్లారెడ్డి గూడెం గ్రామ ప్రజలతో మమేకమై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా యస్పి మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునగా ప్రతి ఒక్కరు ఎన్నికల నియమాలు పాటించాలని,ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ అండగా ఉంటుందని, ప్రజా రక్షణ, భద్రత పోలీసుల లక్ష్యమని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడంలో పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.
గ్రామాల్లో ఏన్నికల ప్రచార సమయంలో ఒకరికొకరు రెచ్చగొట్టే మాటలు, విద్వేషాలకు తావు లేకుంకుండా ఎలాంటి విభేదాలు,వర్గపోరు సృష్టించకుండా ఉండాలని అన్నారు.ముఖ్యంగా యువత అనవసర గొడవలకు వెళ్లి కేసుల్లో ఇరుక్కోకూడదని, కేసులు నమోదైతే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావని సూచించారు.ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, గ్రామంలో ప్రతిరోజూ ఒకరినొకరు చూసుకుంటూ జీవించాల్సి ఉంటుందని, అందువల్ల ప్రజలు ఐక్యతను పాటించాలని సూచించారు. ఓటు హక్కును ప్రశాంతంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు.
గత ఎన్నికల్లో గొడవలకు కారణమైన వారిని ఇప్పటికే బైండోవర్ చేయడం జరిగిందని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరిగి ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అదేవిధంగా ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్లను ఇప్పటికె మూసి వేయించామని, ఏవరైనా అమ్ముతునట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

జిల్లాలో నగదు, మద్యం, ఇతర ఉచిత పంపిణీలపై కట్టుదిట్టమైన నిఘా పెట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఎవరూ ఓటర్లను ప్రలోభపెట్టి మద్యం, నగదు లేదా ఉచితాలు పంపిణీ చేయరాదని స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించి, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎలాంటి సమస్యలు ఉన్న మీ విలెజ్ అధికారికి గాని అధికారులకు తెలియపరిచాలని ఎస్పీ ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో నార్కట్పల్లి సిఐ నాగరాజు, ఎస్సై క్రాంతికుమార్, గ్రామ ప్రజలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
