Breaking News

కొండ మల్లేపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాలు,స్థితిగతులు గురించి యస్.ఐ ను అడిగి తెలుసుకుని రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్,స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలు, సిబ్బందికి కేటాయించిన కిట్లను పరిశీలించడం జరిగింది.స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివరాలు,స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని దర్యాప్తులో ఉన్న కేసులను సమగ్ర విచారణ చేపట్టి చట్టప్రకారం శిక్ష పడే విధంగా కృషి చేయాలని అన్నారు. గ్రామ పోలీసు అధికారులు ప్రతీ రోజు గ్రామానికి సందర్శించి ప్రజలతో మమేకం అవుతూ నేర నియంత్రణకు కృషి చేయాలని అన్నారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు నేర నియంత్రణకు కృషి చేయాలని, బ్లూ కోల్ట్ , పెట్రో కార్ డ్యూటీ లో ఉన్నప్పుడు 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతి రోజు తనిఖీ చేయాలని,స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు,ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది పని చేయాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు అయిన గంజాయి,అక్రమ ఇసుక రవాణా, పిడియస్ రైస్ అక్రమ రవాణా,జూదం లాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని , అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచాలని ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు,ఓవర్ స్పీడ్,ట్రిపుల్ డ్రైవింగ్,మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక ఐపీఎస్, సీఐ నవీన్ కుమార్ ఎస్.ఐ రమేష్ మరియు స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *