బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

వందే మాతరం గీతం భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తిదాయకమైన జాతీయ గీతం.

• వందే మాతరం జాతీయ గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిబ్బందితో కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.
వందే మాతరం జాతీయ గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంవత్సరం పొడువున అనగా 2025 నవంబర్ 7 నుండి 2026 నవంబర్ 7 వరకు స్మారక కార్యక్రమాల ద్వారా వందేమాతరం 150-వసంతాల ఉత్సవాలను జరుపుకోవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఇందులో భాగంగానే ఉదయం 10.00 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలో సిబ్బందితో కలిసి వందేమాతరం జాతీయ గీతం ఆలపించడం జరిగిందని అన్నారు. వందేమాతర గీతాన్ని బంకిమ్ చంద్ర చటర్జీ 1875లో రాశారు. “వందే మాతరం” అంటే “మాతృభూమికి వందనం”, అని అర్థం. “వందే మాతరం” నినాదం బ్రిటిష్ పాలనకు వ్యతిరేక పోరాటంలో ఒక స్ఫూర్తి నినాదంగా నిలిచింది. 1905లో బెంగాల్ విభజన సమయంలో ప్రజలు ఈ నినాదాన్ని పాడుతూ బ్రిటిష్ వ్యతిరేక ఆందోళనలు చేశారు. బాల గంగాధర తిలక్, లాలా లజపతరాయ్, అరవిందఘోష్, బిపిన్ చంద్ర పాల్ వంటి నేతలు ఈ గీతాన్ని ప్రజల్లో తీసుకెళ్లారు. స్వాతంత్ర్య అనంతరం 24 జనవరి 1950 లో భారత రాజ్యాంగ సభ “వందే మాతరం” ను జాతీయ గీతంగా గుర్తించిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావ్, ఎఆర్ డిఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్స్ రమేష్, కిరణ్ కుమార్, నాగేశ్వర్ రావ్, ఆర్ఐ లు రామారావ్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, శ్రీనివాస్ రావ్, ఆఫీసు సూపరిడెంట్స్ అశోక్, మెహనప్ప, డీపీఓ సిబ్బంది తదితరులు ఉన్నారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి