Breaking News

లింక్ షేర్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర సైబర్ నిందుతుడు అరెస్ట్-DSP.

హైదరాబాద్ కు చెందిన మొహమ్మద్ కలీం పాషా, తండ్రి: బాబుజానీ అనునతడు తనకు పరిచయం ఉన్న హైదరాబాద్ కు చెందిన రషీద్ ఇద్దరు కూడా చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి ఎలాగయినా తక్కువ సమయములో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యముతో ఆన్లైన్ ద్వారా ప్రజలను సులువుగా మోసగించి డబ్బులు సంపాదించ వచ్చునే నిర్ణయించుకుని,రషీద్ కి పరిచయం ఉన్న అంకిత్ అనే వ్యక్తి వద్దకు 2025 సంవత్సరములోని ఫిబ్రవరి నెలలో ఇద్దరు కలసి కలకత్తాకు వెళ్లి ఆన్లైన్ ద్వారా ప్రజలను ఎలా మోసాగించాలో అడుగగా అంకిత్ వారికి RBL క్రెడిట్ కార్డు కొరకు దరకాస్తు చేసుకొని కార్డు వచ్చిన తరువాత activation కొరకు చూస్తుంటారో వారి యొక్క పేర్లు, ఫోన్ నంబర్స్, క్రెడిట్ కార్డు నంబర్స్ మరియు పాన్ కార్డ్ నెంబర్ లను అంకిత్ వారిద్దరికీ whatsapp ద్వారా పంపిస్తానని,వాటితో క్రెడిట్ కార్డు కొరకు దరకాస్తు చేసుకొన్న వారితో క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ లాగా వీరిద్దరూ మాట్లాడి వారిని నమ్మించి మోసాలకు పాల్పడే వారు అందులో భాగంగా క్రెడిట్ కార్డ్ activation కొరకు బాధితులతో మాట్లాడి వారికి అంకిత్ పంపిన Apk/links ను పంపితే అట్టి Apk/links ను క్లిక్ చేసినా లేదా ఇన్స్టాల్ చేసుకున్నా వారి ఫోన్ hack అయ్యిన తదుపరి క్షనాలలో అంకిత్ వారి క్రెడిట్ కార్డులలో ఉన్న డబ్బులను e-కామర్స్ ద్వారా కొనుగోళ్ళు జరిపి డబ్బులన్నీ కాజేసేవాడు. అంకిత్ చెపినట్లు మహమ్మద్ కలిమ్, రసిద్ చేసినందుకు ప్రతి లక్ష రూపాయలకు 2,500/- చొప్పున RAPIDO కొరియర్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వీరిద్దరికీ డబ్బులు పంపించేవారు. అంకిత్ కేవలం వీరితో whatsapp ద్వారా మాత్రమె మాట్లాడుతూ క్రెడిట్ కార్డు దారుల వివరాలను పంపుతూ, వీరిద్దరూ ఉపయోగించడానికి RAPIDO కొరియర్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా Mobile phones మరియు SIM కార్డులను ప్రతి 10 రోజులకు ఒకసారి పంపుతూ, పాత Mobile phones మరియు SIM కార్డులను తిరిగి RAPIDO కొరియర్ ద్వారా వెనక్కి తీసుకునే వాడు. అంతర్ రాష్ట్ర సైబర్ నిందుతున్ని పట్టుకోవడంలో కృషి చేసిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *