Breaking News

అధిక వడ్డీ వ్యాపారస్తుల పట్ల జిల్లా ప్రజలు జాగ్రత్తా – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

పలుగు తండా వద్దిపట్ల గ్రామానికి చెందిన రామవత్ బాలాజీ నాయక్ 2019 సంవత్సరంలో డిగ్రీ లో ఫెయిల్ అయిన తరువాత 2020 సంవత్సరంలో ఐస్ క్రీమ్ పర్లాల్ వ్యాపారం కొరకు బందువుల వద్ద 5 లక్షల రూపాయలు రెండు రూపాయల వడ్డీతో తీసుకొని వ్యాపారంలో నష్ట పోయినాడు. తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని డబ్బులు 2 రూపాయల వడ్డీకి దొరకగపొగ 6 రూపాయల వడ్డీ ఇస్తానని ఆశ చూపి నమ్మించి. అదే గ్రామానికి చెందిన వారి నుంచి 10 లక్షలు ఒకరి వద్ద, 5 లక్షలు మరొకరి వద్ద తీసుకొని వడ్డీ చెల్లిస్తూ నమ్మించగా వీరిని చూసి మరి కొంత మంది ఏజెంట్లను పలుగు తండా మరియు చుట్టూ ప్రక్కల గిరిజన తాండలు, గ్రామాల నుండి ఏర్పాటు చేసుకొని అధిక వడ్డీ ఇస్తానని ఆశ పెట్టి వీరి వద్ద డబ్బులు తీసుకొని వారికి ప్రామిసరీ నోట్లు వ్రాసి ఇచ్చి నెలకు 10 రూపాయల వడ్డీ చెల్లించేవాడు. బాలాజీ నాయక్ తన విలాసవంతమైన జీవన శైలిని ఖరిదైన కార్లు మరియు విల్లాలు కొనుగోలు చేసి జనాల నమ్మకాన్ని చూరగొన్నాడు. ఈ విదంగా ఏజెంట్లు (తన బందువులు, అదే కమ్యూనిటీకి చెందిన స్నేహితులు) చుట్టూ ప్రక్కల గిరిజన తండాలు పుట్టనగండి తండా, గడ్డమీది తండా, చింతల్ తండా, నక్కల పేట తండా,పావురాల గట్టు,వద్ద పట్ల గ్రామాల గిరిజన ప్రజల వద్ద అదిక వడ్డీ ఆశ చూపి వారి వద్ద డబ్బులు వసూలు చేసి వారికి ప్రామిసరీ నోట్లు వ్రాసి ఇచ్చి ఇట్టి డబ్బులను బాలాజీ నాయక్ కి ఇచ్చేవారు. ఈ విదంగా బాలాజీ నాయక్ కోట్ల డబ్బులు వసూలు చేశాడు. ఇట్టి డబ్బులతో ఇతను మరియు ఇతని బందువుల మరియు స్నేహితుల పేర్లతో వ్యవసాయ భూములు, ఇండ్లు కరీదైన కార్లు, బైక్ లు కొని జల్పాలు చేసేవాడు. ఇంకా అధిక డబ్బులు వసూలు చేసే ఉద్దేశంతో నెలకు 10 రూపాయల వడ్డీ ఇస్తానని జనాలను నమ్మించి కోట్లలో డబ్బులు వసూలు చేసి వడ్డీ మాత్రమే ఇచ్చి బాదితుల వద్ద ఉన్న ప్రామిసరీ నోటు వెనుకల వడ్డీ ఇచ్చినట్లు వ్రాసి పాత ప్రామిసరీ నోటు తీసుకొని కొత్త ప్రామిసరీ నోటు అదే అసలు అమౌంట్ కి వ్రాసి ఇచ్చేవాడు. ఇలా వచ్చిన కోట్ల డబ్బులతో wines పాప్ పర్మిషన్ ల కోసం సుమారు 2.3 కోట్లు, స్టాక్ మార్కెట్ Intra day on (futures and options) , RBN software solution software company లలో పెట్టుబడులు పెట్టి నష్ట పోయినాడు.
బ్యాంక్ లో వచ్చే వడ్డీ కంటే పది రేట్లు ఎక్కువ వడ్డీ ఇవ్వడం తో జనాలు ఆకర్షితులై బాలాజీ నాయక్ కి అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చారు. గత కొన్ని నెలలుగా బాదితులకు అసలు, వడ్డీ డబ్బులు ఇవ్వలేక పోయే సరికి బాదితులు బాలాజీ నాయక్ పై వత్తిడి చేయడం ప్రారంబించారు. ఇన్ని డబ్బులు ఇవ్వలేక బాలాజీ నాయక్ బాదితుల నుండి తప్పిచ్చుకొని పారిపోయాడు. 1. పర్చునార్ కార్, స్కార్పియో కారు. (వీటి విలువ సుమారు 80 లక్షలు). 2. విలువైన ఆస్తికి సంబందించిన పత్రాలు మిర్యాలగూడ, హైయత్ నగర్, నేరేడుచర్ల, పలుగు తండా లో ఇల్లు, మరియు దామరచర్ల, వడ్డీ పట్ల లో వ్యవసాయ భూమి. 3. బాదితులకు వ్రాసి ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, (36) ఖాళీ ప్రామిసరీ నోట్లు (77). 4. 7 సెల్ ఫోన్లు. (విలువ 5.5 లక్షలు). 5. ఒక రిజిస్టర్ బుక్,excel పీట్. నిందితుణ్ణి నేర ఒప్పుకోలు పంచనామా ప్రకారం సుమారు 106 మంది బాదితులు అని తెలిసింది. బాలాజీ నాయక్ మరియు ఇతని బీనామి ఆస్తులను పోలీస్ విచారణ చేపట్టి, గుర్తించి ప్రభుత్వం ద్వారా జప్తు చేయబడుతాయి తదుపరి కోర్టు ద్వారా బాదితులకు రికవరీ చేయబడతుంది. బాలాజీ నాయక్ ని ఈ రోజు అరెస్ట్ చేసి, రిమాండుకి తరలించడం జరుగుతుంది. ఇట్టి కేసులు అడిషనల్ యస్.పి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు తో విచారణ జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా యస్.పి మాట్లాడతూ బాదితులు ఎవ్వరూ వత్తిడికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని, మద్యవర్తులను నమ్మి మోసపోవద్దు. బాడితులు నేరుగా వారి వద్ద ఉన్న పత్రాలతో గుడిపల్లి పోలీస్ వారిని సంప్రదించి కేసులు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *