Breaking News

మైనర్ బాలికను అత్యాచారం చేసిన నిందితుని 21 ఏళ్ల జైలు

మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసిన నిందితుని 21 ఏళ్ల జైలు మరియు జరిమాన

గడిచిన సంవత్సర కాలంగా పోక్సో యాక్ట్ క్రింద 17 కేసులలో 18 మంది నిందితులకు జైలు మరియు జరిమాన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

కట్టంగూర్ మండలం దూగినవెల్లి గ్రామానికి చెందిన జడిగిల హరీష్ ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించించి మోసం చేసిన ఘటనలో బాధితురాలు ఇచ్చిన పిర్యాదు మేరకు నిందితుడి పైన కట్టంగూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ అనంతరం కోర్టులో ఛార్జ్ సీట్ దాఖలు చేయగా నేడు గౌరవ ADJ-II కమ్ SC/ST కోర్టు & అత్యాచారం మరియు POCSO కేసుల కోర్ట్ నిందితునికి దోషిగా నిర్ధారించి, 21 సంవత్సరాల జైలు 30 వేల రూపాయల జరిమాన బాధితురాలికి రూ.5 లక్షల రూపాయల పరిహారంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించాలని తీర్పు వెలువడించిందని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంగా పోక్సో యాక్ట్ ప్రకారం 17 కేసులలో 18 మంది నిందితులకు గౌరవ న్యాయస్థానం జైలు శిక్ష మరియు జరిమాన విధించడం జరిగిందని ఎవరైనా మైనర్ బాలికలపై ఆత్యాచారాలకు పాల్పడితే ఎప్పటికైన శిక్షలు తప్పవని హెచ్చరించారు.

గంజాయి నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్

ఈ కేసులో సరి అయిన సాక్ష్యదారలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐలు క్యాస్ట్రో రెడ్డి, యస్.ఐ రంజిత్ కుమార్, అలాగే ప్రాసెక్యూషన్ కు సహకరించిన కె.శివరాం రెడ్డి, నల్గొండ DSP, శాలిగౌరారం సిఐ కొండల్ రెడ్డి, కట్టంగూర్ యస్.ఐ రవీందర్,పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వేముల రంజిత్ కుమార్,CDO రువ్వా నాగరాజు, లైజన్ అధికారులు,లీగల్ ఆఫీసర్ బరోసా సెంటర్ కె.కల్పన,P.నరేందర్, N.మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *