చిరునవ్వుతో యూరియా బస్తాతొ ఇంటికి పయనం అయినా కిసాన్…
మహబూబాబాద్ జిల్లాలో ఎరువుల పంపిణీ ప్రక్రియలో పోలీసుల కీలక సహకారం లభించింది. రైతులు ఊపిరి పీల్చుకునేలా, యూరియా బస్తాలను సమర్థవంతంగా మరియు భద్రంగా పంపిణీ చేయడానికి జిల్లా పోలీసులు ముందడుగు వేశారు.
జిల్లా ఎస్పీ సుధీర్ రంనాథ్ కేకన్, పర్యవేక్షణలో,వివిధ రైతు సమితులు మరియు సభ్యులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పారదర్శకంగా యూరియా ఎరువులు అందజేయబడ్డాయి. ఈ సందర్భంగా రైతులు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తూ, పోలీసుల సహకారం వల్ల తాము నిశ్చింతగా ఎరువులు అందుకున్నామని తెలిపారు.
మహబూబాబాద్ పోలీసు విభాగం, రైతుల సమస్యలను అర్థం చేసుకుని సమయానుకూల చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.