Breaking News

డ్రంకెన్ డ్రైవ్ ను ఏమాత్రం సహించం…

ట్రాఫిక్ ఉల్లంఘునులపై కఠిన చర్యలు
డ్రంకెన్ డ్రైవ్ ను ఏమాత్రం సహించం
హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం పనితీరుపై సమీక్ష
ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్ ను ఏమాత్రం సహించమని ఆయన స్పష్టం చేశారు.


హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో ట్రాఫిక్ విభాగంపై సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ పోలీసింగ్ ను మరింతగా మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం పలు అంశాలపై ట్రాఫిక్ సిబ్బందికి దిశానిర్దేశము చేశారు.


హైదరాబాద్ పోలీస్‌కు ట్రాఫిక్ సిబ్బందే ముఖచిత్రం అని, నిబద్దత , అంకిత భావముతో పనిచేస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ విభాగ పనితీరు రోజు రోజుకి మెరుగుపడుతోంద‌ని సంతృప్తి వ్యక్తం చేశారు.


డ్రంకెన్ డ్రైవ్‌, మైన‌ర్ డ్రైవింగ్, రాంగ్ రూట్, డేంజ‌ర‌స్ డ్రైవింగ్, త‌దిత‌ర ఉల్లంఘ‌నుల‌ను ఏమాత్రం ఉపేక్షించ‌కుండా, చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్ర‌తి నెల క్రమం తప్పకుండా అన్ని శాఖల అధికారులతో ‘కన్వర్జెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా ఈ స‌మా వేశాల్లో చ‌ర్చిస్తామ‌ని పేర్కొన్నారు.


యూటర్న్ లపై శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రియ‌ల్ టైం ట్రాఫిక్ మానిట‌రింగ్ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత‌గా ప‌టిష్టం చేయాల‌ని సూచించారు. సాకేంతిక‌త ద్వారా ట్రాఫిక్ స‌మ‌స్య‌లకు అడ్డుక‌ట్ట వేసేందుకు ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ఆదేశించారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు..


విధి నిర్వ‌హ‌ణ‌లో అత్యుత్త‌మ ప‌నితీరును క‌న‌బ‌రిస్తే త‌గిన గుర్తింపు ఇస్తామ‌ని, ఎవరైనా రోడ్లపై అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని స్ప‌ష్టం చేశారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మల్టీప్లేయర్‌గా పనిచేయాల్సిన అవసరం ఉంద‌ని అన్నారు. రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్ప‌డు ట్రాఫిక్ అధికారులు.. సంఘ‌ట‌న స్థ‌లానికి వెళ్లి ప‌రిశీలించాల‌న్నారు. త్వరలో ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రోటోకాల్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఉన్న‌తాధికారులంద‌రూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశమునకు జాయింట్ సీపీ ట్రాఫిక్ శ్రీ డి. జోయల్ డెవిస్ ఐ.పి.ఎస్, డీసీపీ ట్రాఫిక్ శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు ఐ.పి.ఎస్ మరియు డీసీపీ ట్రాఫిక్ శ్రీ ఎస్. శ్రీనివాస్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు మరియు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగము నుండి సుమారు 450 మంది పోలీసులు పాల్గొన్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *