బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Hyderabad

రోడ్డు ప్రమాదాలు, ఆర్ధిక నేరాలు, ఆన్లైన్ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి.

రోడ్డు ప్రమాదాలు, ఆర్ధిక నేరాలు, ఆన్లైన్ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి.

• లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు, ఎబ్.బి.డబ్ల్యూ ఎగ్జిక్యూషన్ ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి..
• ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకొని, ఇన్వెస్టిగేషన్లో మెళకువలు నేర్చుకోవాలి.
• రోడ్డు ప్రమాదాలు, ఆర్ధిక నేరాలు, ఆన్లైన్ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి..
• విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రివార్డ్ ల అందజేత..
• వివాహా, శుభ కార్యాలయాల్లో, బిక్షాటనలో హిజ్రాలు ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకోవాలి.
• మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా అధికారులకు పలు సూచనలు చేసిన..
జిల్లా ఎస్పీ. శ్రీ పరితోష్ పంకజ్ ఐపియస్.

మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా ఈ రోజు తేది: 18.11.2025 నాడు సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఈ సందర్భంగా ఎస్పీ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, మిస్సింగ్, ఎబ్.బి.డబ్ల్యూ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ లో వేగం పెంచాలని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అండగా నిలవాలని అధికారులకు సూచించడం జరిగింది. లాంగ్ పెండింగ్ కేసుల చేధనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ఇన్వెస్టిగేషన్లో సందేహాలు ఉంటే, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలన్నారు.

ఎస్.హెచ్.ఓ లు తమ ఏరియాలో గల ప్రతి గ్రామాన్ని సందర్శించి, ఆయా ప్రాంతాలలో గల సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. విలేజ్ పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామలపై పూర్తి అవగాహన కలిగి, ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు. రౌడీ షీటర్స్, సస్పెక్ట్ ల కదళికలై నిఘా ఉంచి, తరుచూ చెక్ చేయాలని అన్నారు. బ్లూకోల్ట్స్ మరియు నైట్ పెట్రోలింగ్ సిబ్బంది “పాపిలోన్ డివైస్” లను వినియోగిస్తూ.. అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ సేకరించాలన్నారు. విమెన్ సేఫ్టీ, రోడ్డు ప్రమాదాలు, ఆర్ధిక నేరాలు, ఆన్లైన్ మోసాల గురించి ఆయా ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరచలాని అన్నారు.
వివాహాలు, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలయాల్లో, బిక్షాటనలో హిజ్రా తాము అడిగిన డబ్బును ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, లేదంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తామని ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకోవాలి ఎస్.హెచ్.ఓ లకు సూచించారు. నేరాల అదుపులో, జరిగిన నేరాలను ఛేదించడంలో సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ.., వివిధ కుల మతాలకు చెందిన పవిత్ర స్థలాలలో, పరిశ్రమలు, ధాబాలు, పెట్రోల్ పంప్స్ తదితర ముఖ్యమైన ప్రాంతాలలో కమ్మునిటీ సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా, వివిధ సంఘాల పెద్దలకు అవగాహన కల్పించాలని యస్.హెచ్.ఒ లకు సూచనలు చేశారు.

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగం

అనంతరం యస్.హెచ్.ఓ వాహనాలను తనిఖీ చేస్తూ. ప్రతి వాహనాన్ని రెగ్యులర్ సర్వీసింగ్ చేయిస్తూ, ఎలాంటి రిపేర్స్ లేకుండా పూర్తి కండిషన్ లో ఉండే విధంగా చూసుకోవాలని డ్రైవరులకు సూచించారు. వివిధ విభాగాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ గారు అభినందించి, రివార్డ్ లు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సమీక్షా సమావేశంలో అదనపు.ఎస్పీ సిహెచ్. రఘునందన్ రావ్, డియస్పిలు సత్యయ్య గౌడ్, ప్రభాకర్, వెంకట్ రెడ్డి, సైదా నాయక్, సురేందర్ రెడ్డి, ఎఆర్. డిఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్స్ రమేష్, కిరణ్ కుమార్, నాగేశ్వర్ రావ్, సదా నాగరాజు, ప్రవీణ్ రెడ్డి, నాగేశ్వర్ రావ్, మరియు జిల్లా ఇన్స్పెక్టర్స్, సబ్ఇన్స్పెక్టర్స్, తదితరులు పాల్గొన్నారు.