బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

గణేశ్ విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేసేందుకు అవసరమైన కార్యాచరణ – సి.వి. ఆనంద్ ఐపీఎస్.

సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం, మెహదీపట్నం లో సి.వి. ఆనంద్ ఐపీఎస్, డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం బందోబస్తుపై సౌత్ వెస్ట్ జోన్ పరిధిలోని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ మరియు ఇతర పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని తెలిపారు. అసాంఘిక శక్తులు, పిక్ పాకెటర్లు, ఈవ్ టీజర్లు, గొలుసు దొంగతనం వంటి నేరాలను నివారించడానికి పటిష్టమైన నిఘా ఉంచాలని కోరారు. ముందు జాగ్రత్తగా రాత్రిపూట విగ్రహాల వద్ద నిర్వాహకులు లేదా వాలంటీర్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. గణేశ్ విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై చర్చించి, మండప నిర్వాహకులకు విగ్రహాలను నిమజ్జనానికి సాధ్యమైనంత త్వరగా బయలుదేరి, క్షేమంగా ఇంటికి చేరుకోవాలని సూచించాలని అధికారులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. 2. సి.వి. ఆనంద్ ఐపీఎస్, డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో గోషామహల్, తప్పా చబుత్రా, లంగర్ హౌస్, గోల్కొండ లోని ముఖ్యమైన గణేశ్ మండపాలను తనిఖీ చేశారు. మండపాల నిర్వాహకులతో మరియు వాలంటీర్లతో మాట్లాడారు. వర్షాలు పడుతున్నందున మండపాల నిర్వాహకులు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేనిచో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని వారికి సూచించారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా భక్తులు మరియు ప్రజలు అందరూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. 3. సి.వి. ఆనంద్ ఐపీఎస్, డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాద్, కుల్సుంపురా పోలీస్ క్వార్టర్స్‌లో కొత్త క్రికెట్ ప్రాక్టీస్ సౌకర్యాన్ని ప్రారంభించారు. పోలీసు సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని, అభివృద్ధిని మరియు సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి పిచ్ మరియు నెట్‌తో కూడిన ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అధికారికంగా స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ ఆడి ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. 4. టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగా బౌలీలో ఒక ఔట్ పోస్టును ప్రారంభించారు. ఈ సమీక్షా సమావేశం మరియు అన్ని కార్యక్రమాలకు జి.చంద్ర మోహన్ ఐపీఎస్ (డీసీపీ, సౌత్ వెస్ట్ జోన్), శ్రీమతి కె. అపూర్వ రావు ఐపీఎస్ (డీసీపీ, ఎస్.బి), ఆర్.వెంకటేశ్వర్లు ఐపీఎస్ (డీసీపీ, ట్రాఫిక్), ఎం.ఏ. బారి, డీసీపీ, ఇక్బాల్ సిద్ధీఖీ అడిషినల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ మరియు సౌత్ వెస్ట్ జోన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి