Breaking News

గంజాయి నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్

*అక్రమంగా గంజాయి విక్రయిస్తూ, గంజాయి తాగుటకు బానిసలై బైక్ దొంగతనములకు పాల్పడుచున్న నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్. కె.శివరాం రెడ్డి డీఎస్పీ నల్గొండ.

సైబర్ నేరాలపై ప్రతి ఒకరికి అవగాహన అవసరం…
  • ముగ్గురు నిందితులు అరెస్టు.
  • వీరి వద్ద నుండి 35 వేల విలువ గల 1.600 కిలోల గంజాయి, 1 మోటార్ సైకిల్ స్వాదీనము.
    నిందితుల వివరాలు:
    1) లింగగళ్ళ పూర్ణ చందు తండ్రి విజయ్ కుమార్, వయస్సు 19 సం,, వృత్తి DTDC కొరియర్ బాయ్, నివాసం ప్లాట్ నెం 201/A, 6th block, జనప్రియ అపార్ట్మెంట్స్, మియాపూర్, హైదరాబాద్,
    2) కానుకుంట్ల జగదీష్ తండ్రి మహేష్, వయస్సు మహేష్, వయస్సు 19 సం,, వృత్తి కాటరింగ్, నివాసం పద్మ నగర్, మలక్ పేట, హైదరాబాద్ ప్రస్తుత నివాసం శ్రీనివాస కాలనీ, ఫారెస్ట్ ఆఫీసు రూట్, బి.టి.ఎస్, నల్గొండ పట్టణం,
    3) హరిజన్ మహేష్ తండ్రి అనంతయ్య, వయస్సు 20 సం,, వృత్తి ప్రైవేట్ జాబ్, నివాసం ఫ్లాట్ నెం 283, 10th block, జనప్రియ అపార్ట్మెంట్స్, మియాపూర్, హైదరాబాద్ తెలంగాణ రాష్ర్ట౦ ప్రతిష్టాత్మికంగా తీసుకొన్న మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగ౦గా మరియు ఆస్తి సంబందిత నేరాలను అరికట్టుట లో మరియు చేధించుట లో భాగంగా నల్గొండ జిల్లా యస్.పి. శ్రీ శరత్ చంద్ర పవార్ IPS గారి ఆదేశాల మేరకు తేదీ: 21 .01.2025 న మధ్యాన్నం అందాజా 4 గంటల సమయములో SI నల్గొండ 1 టౌన్ మరియు సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు నల్గొండ పట్టణము మిర్యాలగూడ రోడ్డు లో టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ దగ్గరలో వాహనములు తనికి చేయుచుండగా నిందితులు డి. ఇ. ఓ. ఆఫీసు వైపు నుండి ఒకే మోటార్ సైకిల్ మీద ముగ్గురు వస్తూ అనుమానాస్పదంగా కనిపించగా, SI గారు పట్టుబడి చేసి వారిని విచారించగా అట్టి నిందితులు సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని ఒక పథకం ప్రకారం హైదరాబాద్ బాల నగర్ లో 2 కేజీల గంజాయిని కొనుగోలు చేసి కొంత వారి సొంతానికి వాడుకొని మిగిలిన గంజాయిని తీసుకొని నల్గొండ కు తేదీ 16.01.2025 రోజున రాత్రి కలెక్టర్ ఆఫీసు సమీపమున జీరాక్స్ సెంటర్ ముందు దొంగిలించిన ద్విచక్ర వాహనముపై వచ్చినట్లు ఒప్పుకున్నారు.
    నిందితుల వద్ద నుండి 1.600 కే‌జిల గంజాయిని మరియు ఒక ద్విచక్ర వాహనమును స్వాధీనం చేసుకోనైనది. ఇట్టి నేరంలో వారి పై Cr.No.14 /2025 U/s 303 (2) BNS మరియు Sec. 8 (C) 20(b)(ii)(B), 29 of NDPS Act-1985 Amendment Act 2001 ప్రకారంగా నల్గొండ 1 టౌన్ PS నందు కేసు నమోదు చేసి కోర్ట్ లో హాజరు పర్చనైనది.
    ఇట్టి కేసును నల్గొండ DSP, K. శివరాం రెడ్డి పర్యవేక్షణలో Nalgonda 1 town ఇన్స్పెక్టర్ రాజ శేఖర్ రెడ్డి ఆద్వర్యంలో నల్గొండ 1 టౌన్ యస్. ఐ . జె. సైదులు మరియు వారి సిబ్బంది కృష్ణ నాయక్, ఇంద్రా రెడ్డి, శ్రీకాంత్, శకీల్, మధుసూదన్ రెడ్డి, కిరణ్ కుమార్ లను జిల్లా S.P అభినందించనైనది.
     అక్రమ గంజాయి, మాదకద్రవ్యాలు సరఫరా చేసినా, అమ్మినా, మరియు ఎవరైనా వినియోగించినా/వాడినా ఉపేక్షించేది లేదు: జిల్లా యస్పి.
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాదకద్రవ్య వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉక్కుపాదంతో అణిచివేస్తామని, ఎంతటి వారినైనా ఉపేక్షించమని, యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని, గంజాయి, సరఫరా, అమ్మే వ్యక్తుల పైనే కాకుండా, సేవించే/వినియోగించే వ్యక్తుల పైన కూడా చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా S.P గారు హెచ్చరించనైనది.
    గంజాయి, మాదక ద్రవ్యాలు విక్రయాల గురించి గాని, సేవించే వ్యక్తుల గురించి, ఏ రూపంలోనైనా మాదకద్రవ్యాలను సరఫరా చేసేవారి గురించి మీకు సమాచారం తెలిసిన వెంటనే, డయల్ 100 మరియు డయల్ 8712670141 ద్వారా లేదా నేరుగా మా పోలీసు సిబ్బందికి లకు తెలియజేయవచ్చును. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మాదకద్రవ్యాల నివారణలో ప్రజలు, పోలీసు వారికి సహకరించి, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో అందరూ పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాము.
    అలాగే జిల్లాలో దొంగతనాల నివారణకు పటిష్ఠ నిఘా, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని,జిల్లాలో దొంగతనాలు నివారణకు పగలు రాత్రి పటిష్ఠ గస్తీ నిర్వహిస్తూ, పాత నేరస్తుల కదలికలపైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టామని తెలిపారు.జిల్లా ప్రజలు కూడా మీ ఇంటి పరిసరాల్లో, కాలనీల్లో, షాపులలో సిసిటివి కెమెరాలు అమర్చుకోవడం చాలా ముఖ్యమని, ఏదైనా సంఘటన జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తుల కదలిక పై తగు చర్యలు తీసుకునుటకు వీటి ప్రాముఖ్యత చాలా అవసరం ఉంటుందని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాల్లో కాలనీల్లో,షాపులలో మరియు ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *