ప్రయాణికులకు ఆటోలో సురక్షితంగా ప్రయణిస్తున్నామనే నమ్మకం కలిగించాలి.
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ,పరిమితి లోపు ప్రయాణికులను ఎక్కించుకోవాలి
జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.
ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆటోలకు అభయ QR కోడ్,డ్రైవర్లుకు ప్రమాద భీమా పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ.
ప్రయాణికుల సురక్షిత,భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ప్యాసింజర్ వాహనాలకు మొదటి దశలో 4000 వాహనాలకు అనుసంధానం చేయడం జరిగిందని, రెండవ దశలో కొత్తగా 800 వాహనాలకు అభయ యాప్ QR కోడ్ ని అనుసంధానం చేయడంతో పాటు అభయ యాప్ తో వాహనాల డ్రైవర్లకు 50 రూపాయలతో యాక్సిడెంట్ డెత్ కు లక్ష రూపాయల ఇన్సూరెన్స్ వచ్చేలా ఒక సంస్థతో అనుసంధానం చేసి ప్రమాద భీమా పత్రాలు అందించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.