Breaking News

పేలుడు పదార్థాలపై – జిల్లా టాస్క్ఫోర్స్, ముస్తాబద్ పోలీసులు ఆకస్మిక దాడులు.

నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ లేకుండా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన, రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవు. వివరాలు వెల్లడించిన ముస్తాబద్ ఎస్.ఐ గణేష్. నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామానికి చెందిన గడిపర్తి శ్రీనివాసరావు తండ్రి వెంకటయ్య వయస్సు. 56 సం. లు అనే వ్యక్తి తన యజమాని ఓర్సు సాయి మల్లు ఆదేశాల మేరకు తేదీ 21/07/2025 రోజున రాత్రి తన టాటా వాహనంలో ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను తీసుకవచ్చి నామపూర్ గ్రామంలోని శివరాత్రి రాజు తండ్రి వెంకటయ్య అనే వ్యక్తికి బండ పనుల నిమిత్తం అమ్ముతుండగా నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా టాస్క్ఫోర్స్ సి.ఐ నటేష్,ముస్తాబద్ ఎస్.ఐ గణేష్ ఆధ్వర్యంలో దాడులు చేసి వారి వద్దనుండి పేలుడు పదార్దాలు 1. Ideal Power gelatin sticks 2600 ,Ideal booster gelatin sticks 405,6000 మీటర్ల Ideal cordex వైర్ , Detonators175 మరియు టాటా యోధా వాహనం నెం. TS-16-UC-2772 స్వాధీనం చేసుకొని 1. శ్రీనివాసరావు 2. శివరాత్రి రాజు మరియు 3.ఓర్సు సాయి మల్లు అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ఎస్.ఐ గణేష్ తెలిపారు. ఎవరు కూడా ప్రజా నివాస ప్రాంతాల్లో ఎలాంటి లైసెన్స్ లేకుండా జెలాటిన్ స్టిక్స్ కానీ పేలుడు పదార్ధాలు నిల్వ ఉంచుతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జెలాటిన్ స్టిక్స్ కానీ పేలుడు పదార్ధాలు ఎవరైనా వినియెగించాలనుకుంటే దానికి సబంధిచిన అనుమతి లైసెన్స్ తప్పని సరిగా తీసుకోవాలన్నారు.

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *